Vastu Tips: దిశలలో దక్షిణ దిశను సందపకు మారు పేరుగా పరిగణిస్తారు. చాలా మంది ఈ దిశను యముడు నివాసంగా కూడా పరిగణిస్తారు. కానీ ఈ దిశలో కొన్ని మార్పులు చేస్తే డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయని నమ్మకం. అయితే వాస్తు ప్రకారం ఇంటిని కొనుక్కోగానే సరిపోదు. ఇంట్లో ఉంచే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. అప్పుడే మన జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా, ఆనందంగా సాగుతుందట. ముఖ్యంగా జీవితంలో ఆర్థిక సమస్యలు రాకూడదంటే ఇంట్లో వాస్తు ప్రకారం, కొన్ని మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు పండితులు.
ఇంటి దక్షిణ దిశను యముడు, పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఈ దిశ కూడా స్థానం ప్రతిష్టకు చిహ్నంగా భావించాలట. చాలా మంది ఈ దిశను అశుభంగా భావిస్తారు. కానీ ఈ దిశ అశుభం కాదట. ఈ దిశలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచితే, అది ఆనందం, శ్రేయస్సు, సంపద, సమృద్ధిని ఆకర్షిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం. చీపురును దక్షిణ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని, ఎవరూ చూడని విధంగా చీపురును ఉంచాలని చెబుతున్నారు. ఇంటికి వచ్చిన వారికి ఈ చీపురు కనపడకూడదు.
అలా ఎదురుగా కాకుండా దక్షిణ దిశలో ఉంచాలట. మీ ఇంట్లో విలువైన వస్తువులు లేదా బంగారం ఉంటే, వాటిని దక్షిణ దిశలో ఉంచడం మంచిదట. ఇలా చేయడం ద్వారా, కుబేరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయని చెబుతున్నారు. దక్షిణ దిశలో జాడే మొక్కను ఉంచడం శుభప్రదంగా భావిస్తారట. ఈ దిశలో జాడే మొక్కను ఉంచడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని వేలాడదీయడం కూడా శుభప్రదం. ఇది సానుకూలతను తెస్తుందని , కుటుంబంలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని చెబుతున్నారు. ఇటువంటి చిత్రం తరచుగా ధనవంతుల ఇళ్లలో వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నాలుగు మార్పులు కనుక చేసుకుంటే కచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభించడమే కాకుండా, డబ్బుకు కొరత ఉండదని చెబుతున్నారు.
Vastu Tips: మీ ఇంట్లో దక్షిణ దిశలో ఈ నాలుగు వస్తువులు ఉంచితే చాలు.. డబ్బు సమస్యలు పరార్!

Tips