November 2024 : వృశ్చికరాశిలోకి శుక్రుడు.. నవంబరు 7 వరకు మూడురాశుల వారికి కష్టాలు !

నవంబరు 7 వరకు మిథున రాశి వారు కొంత అలర్ట్‌గా(November 2024) ఉండాలి. 

Published By: HashtagU Telugu Desk
Zodiac Signs November 2024 Shukra Gochar Vrishchik 2024

November 2024 : వచ్చే నెల (నవంబరు) 7 వరకు మూడు రాశులకు చెందిన పలువురికి కష్టాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇంతకీ ఆ మూడు రాశులు ఏమిటి? ఆ రాశుల వారికి ఎదురయ్యే అవకాశమున్న ఆటంకాలు, సమస్యలు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Pet Dog : యజమాని మరణం జీర్ణించుకోలేక పెంపుడు కుక్క మరణం

విలాసాలు, ఐశ్వర్యం, ఆనందాలకు అధిపతి శుక్రుడు. ఏదైనా రాశిలో శుక్రుడు  సంచరిస్తే.. ఆ రాశికి చెందిన వారి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, విలాసాలను నిర్ణయిస్తాడు. అక్టోబరు 13న శుక్రుడు.. వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు.  నవంబరు 7 వరకు శుక్రుడు.. వృశ్చికరాశిలోనే సంచరిస్తాడు. ఈ వ్యవధిలో కేవలం మూడు రాశులవారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: Jagan House : ప్రజల సొమ్ము.. కంచెకు పెట్టిన జగన్

  • నవంబరు 7 వరకు మిథున రాశి వారు కొంత అలర్ట్‌గా(November 2024) ఉండాలి.  ఈ రాశివారు చేపట్టే కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. మరికొన్ని పనులు అరకొరగా పూర్తవుతాయయి. ఎక్కువ కష్టపడినా ఫలితం పెద్దగా రాదు. మానసిక ఒత్తిడి చుట్టుముడుతుంది. గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు.. మళ్లీ చుట్టుముట్టే ముప్పు ఉంది. అనవసర గొడవలకు పోవద్దు. కోర్టు కేసుల్లో ఉన్నవారికి సహనం అవసరం.
  • నవంబరు 7 వరకు మేష రాశిలోని ఉద్యోగులు, వ్యాపారులు కాస్త చాకచక్యంగా వ్యవహరించాలి.  ప్రత్యర్థుల కుట్రలు వెంటాడే రిస్క్ ఉంది. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. ఇంట్లో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామితో బంధానికి విలువ ఇవ్వాలి. మానసిక ఒత్తిడికి లోను కావద్దు.
  • నవంబరు 7 వరకు ధనుస్సు రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.  ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయినా ధైర్యంగా ముందుకుసాగాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. విలాసాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే నష్టాలే మిగులుతాయి. ఉద్యోగం చేసే వారిపై పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. కళ్లు, పొట్టకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.

  Last Updated: 16 Oct 2024, 10:53 AM IST