Vasthu Tips: భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా.. అయితే ఈ పని చేయాల్సిందే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 06:30 PM IST

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలకు వాస్తు కూడా కారణం కావచ్చు. ఇంట్లో భార్య భర్తలు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆ ఇల్లు ప్రశాంతంగా సౌభాగ్యంతో వెళ్లి విరుస్తుంది. అయితే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే తరచూ గొడవ పడుతూ ఉంటే పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత వాటిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.

వాస్తు శాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడిటీలు పనికొస్తాయి. మరి ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, అలాగే నిత్యం గొడవలు అవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది. కాబట్టి గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కళ్లుప్పుని వేసి నెల రోజుల పాటూ వదిలేయండి.

ఒక నెల తరువాత ఆ ఉప్పు తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లల్లో ఇతని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది. కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం మానేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు.