Peacock Feathers: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందంతోపాటు సంపద కూడా.. ఎలా అంటే?

నెమలి.. ఈ పక్షిని ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ నెమలి ఈకలను, నెమలిన

Published By: HashtagU Telugu Desk
Peacock Feathers

Peacock Feathers

నెమలి.. ఈ పక్షిని ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ నెమలి ఈకలను, నెమలిని ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో నెమలి ఈకలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. చాలామంది నెమలి ఈకలను ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నెమలి ఈకలతో ఇంటిని అలంకరించుకోవడం వల్ల ఇల్లు అందంగా కనిపించడంతో పాటు ఆర్థికంగా కూడా లాభం చేపడుతుంది అంటున్నారు నిపుణులు. నెమలీకలు ఉన్నచోటకి బల్లులు రావు.

గోడలపై నెమలీకల గుత్తిని తగిలిస్తే బల్లులు, ఇతర కీటకీలు మీ ఇల్లు వదిలి పారిపోతాయి. ఇంటి ప్రతి మూలలో నెమలీకలను ఉంచితే బల్లుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా ఇంటి పరిశుభ్రతను కాపాడుతుంది. నెమలి అంటేనే అందానికి ప్రతీక. ఇంట్లో నెమలీకలు గుత్తులు పెట్టగానే ఇల్లు ఆహ్లాదకరంగా మారుతుంది. నెమలి నృత్యం చేసే భంగిమలో నెమలి కన్నులను అమరిస్తే ఆ గదికి గొప్పగా, ఆడంబరంగా, అందంగా కనిపిస్తుంది. నెమలి ఈకలను మీ కార్యాలయంలో, ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రదేశంలో ఉన్న నెగిటివ్ వైబ్స్‌ తొలగిపోతాయి.

అలాగే నివాసస్థలంలోని వాస్తుదోషాలు కూడా పోతాయి. మానసిక ఒత్తిడి పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. నెమలీ ఈకలను ఇంట్లోని ఆగ్నేయదిశలో ఉంచితే చాలా మంచిది. ఇలా ఉంచడం వల్ల సంపద, ఆనందం పెరుగుతాయి. గోడలపై నెమలి పెయింటింగ్ లు పెట్టుకున్నా మంచిదే. కుటుంబ సంబంధాలను బలపరచడంతో పాటూ, శాంతి వర్ధిల్లుతుంది. ప్రతి ఇంట్లో వినాయక పటం లేదా విగ్రహం ఉండాలని చెబుతారు. గణేష్ విగ్రహం సానుకూల శక్తిని ఇంట్లోకి తీసుకొచ్చి, ప్రతికూల ప్రభావాలను రాకుండా అడ్డుకుంటుంది. వినాయక విగ్రహానికి నెమలీకను జతచేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో సంపద పెరగాలంటే నెమలికన్నులను తెచ్చి మీరు డబ్బులు దాచే చోట పెట్టుకోవాలి. ఇది సంపదను పెంచడమే కాదు, ఆ సంపదకు స్థిరత్వాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం..

  Last Updated: 30 May 2023, 05:48 PM IST