Site icon HashtagU Telugu

108 Aartis : ఏ హారతితో మనకు ఏ ఫలితం సిద్ధిస్తుంది ?

108 Aartis

108 Aartis

108 Aartis : సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా, సశాస్త్రీయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. జీవుడిని పరమాత్మవైపు నడిపించే కాగడానే హారతి. ఇవి 108 రకాలని ఋగ్వేదం చెబుతోంది. ఏక హారతి మొదలుకొని 108 జ్యోతుల వరకూ హారతులను లెక్కిస్తారు. 108 జ్యోతులతో చేసేదాన్ని అష్టోత్తర హారతి అని పిలుస్తారు. జ్యోతుల సంఖ్య పెరిగేకొద్దీ వాటికి ప్రత్యేక మంత్రం ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: 7 Signs Of Fantasies : మీ భాగస్వామి మరొకరితో లైన్‌లో ఉన్నాడనడానికి 7 సిగ్నల్స్

దీపావళి రోజున..

నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.