ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా … […]

Published By: HashtagU Telugu Desk
Ttd

Ttd

Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది.

ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా కొలువైకనిపిస్తాడు. గర్భాలయంలో నిలువెత్తు విగ్రహాలు సుందరంగా … సుకుమారంగా కనిపిస్తూ భక్తుల హృదయాలను కొల్లగొడుతూ వుంటాయి. ఇక్కడి స్వామివారిని ‘కళ్యాణ వేంకటేశ్వరుడు’గా భక్తులు కొలుస్తుంటారు. వివాహం విషయంలో ఆటంకాలు ఎదుర్కుంటున్న వారు మూడు శుక్రవారాల పాటు స్వామివారికి అభిషేకాలు చేయిస్తుంటారు.

ఈ విధంగా చేయడం వలన వెంటనే అ సమస్య పరిష్కరించబడుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఈ కారణంగా శుక్రవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. ఇక అన్నప్రాసనలు … అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇదే ప్రాంగణంలో రాజ్యలక్ష్మీ దేవి … సంతాన నాగేశ్వరస్వామి పూజలు అందుకుంటూ వుంటారు. దసరా నవరాత్రులలో రాజ్యలక్ష్మీ అమ్మవారిని నవదుర్గా రూపాల్లో అలంకరించి పూజిస్తుంటారు.

ఇక ఈ క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించిన రోజుని పురస్కరించుకుని, వైశాఖ మాసంలో ప్రత్యేక పూజలు … ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని సేవించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కళ్యాణ వేంకటేశ్వరుడికి పూలు … పండ్లు … కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.

  Last Updated: 19 Dec 2025, 05:27 PM IST