Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక వృత్తాంతం

హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది...ప్రధానంగా హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా ప్రస్తావింపబడింది...హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అని అనడంలో అతిశయోక్తి లేదు.

Hanuman Sindoor; హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది…ప్రధానంగా హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా ప్రస్తావింపబడింది…హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అని అనడంలో అతిశయోక్తి లేదు.

ఆంజనేయ స్వామి మంగళవారం మరియు శనివారాలలో ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజలు అందుకుంటాడు… ఇక హనుమంతుడికి ఇష్టమైన వాటిలో సింధూరం కూడా ఒకటి. ఆంజనేయుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయట…… అంతేకాకుండా అంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మనపై ఉంటుందంట… అయితే హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టం అనే దాని వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఆంజనేయస్వామికి మరియు సింధూరాన్ని ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం.

శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒకరోజున సీతమ్మతల్లి తలస్నానం చేసి నుదుట తిలకం దిద్ది, పాపిట సింధూరం పెట్టుకుని శ్రీరామునితో పాటుగా విశ్రాంతి మందిరానికి వెళ్తున్నప్పుడు, శ్రీరాముని సేవకి హనుమంతుడు వేచి ఉంటాడు. ఇది గమనించిన సీతారాములు వెనక్కి తిరిగి చూస్తారు. సీతా దేవి హనుమంతునితో, మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాము. నువ్వు రాకూడదు అని చెప్తుంది. రాములవారు కూడా సీతమ్మ చెప్పినట్లు చేయమని అంటారు. మిమ్మల్ని సేవించకపోతే, నాకు కునుకు పట్టదు కదా సీతమ్మ చెప్పినట్లే, మీరు కూడా చెప్తున్నారు అని అంటాడు హనుమంతుడు. అప్పుడు రాములవారు హనుమంతుడితో పెళ్ళప్పుడు ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టాను. ఆ కారణంగా ఆమెకి దాసుడనయ్యాను అని రాములవారు అంటారు.

హనుమంతుడు సీతమ్మతో “అమ్మ నీ నుదుట తిలకముంది కదా? పాపిట సింధూరం దేనికి? అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ వారు “స్వామి వారికి దీర్ఘాయువు కోసం తాను సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని” ” చెప్తుంది. వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తలా నుంచి తోకా వరకు ఒళ్ళంతా సింధూరం రాసుకొని సీతారాముల దగ్గరకి వెళ్తాడు..అది చూసి శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమా ఇదేంటి అని అడిగితే మీరు చిటికెడు సింధూరాన్ని సీతాదేవికి అలంకరించడం వల్లనే ఆమెకు దాసుడయ్యారు. చిటికెడు సింధూరంతోనే సౌభాగ్యం కలిగితే, నేను శరీరం మొత్తం సింధూరాన్ని అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశ‌పడితిరా ప్రభు అని అమాయకంగా అడుగుతాడు. అలా రాముని మెప్పు కోసం హ‌నుమ సింధూరాన్ని ధ‌రించ‌డం మొద‌లు పెట్టాడు.

Also Read: Devotional Tree: భారత్ లో ఆధ్యాత్మిక శక్తి ఉన్న చెట్లు ఏవో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!