Site icon HashtagU Telugu

Mundan Ceremony: పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇవ్వాలి.. దానివల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా?

Mundan Ceremony

Mundan Ceremony

ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయాలలో సంవత్సరం లోపు పిల్లల తలనీలాలను దేవుడికి సమర్పించడం. అయితే దేవుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు దాని వల్ల కలిగే ఫలితం ఏంటి అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఆ విషయాల్లోకి వెళితే.. కాగా శిరోజాలు పాపాలకు నిలయాలు అని పండితులు చెబుతూ ఉంటారు. వాటిని తీసివేయడం వల్ల పాపాలను తొలగించుకున్నట్లు అర్థం. కాగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు తన తల ద్వారా భూమి పైకి వస్తాడు. ఆ నవజాత శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకుని వుంటాయి.

అందుకనే చిన్న వయసులోనే కేశఖండన లేదా పుట్టు వెంట్రుకలు కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకే చాలామంది భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తాము అని మొక్కుకుంటూ ఉంటారు. అలాగే శిశువు పుట్టిన తర్వాత సంవత్సరంలోపు మొదటిసారిగా పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారు అన్న విషయానికి వస్తే.. శిశువు మొదటి సారి జుట్టు తీయడం వలన గతజన్మ పాప ప్రక్షాళనతో బాటు మంచి జ్ఞానార్జన కు ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పుట్టు వెంట్రుకలు సంవత్సరంలోపు లేదా మూడవ ఏట లేదా ఐదు సంవత్సరాల వయసులో తీయాల్సి ఉంటుంది.

ఉత్తరాయణ పుణ్యకాలంలో కేశఖండన కార్యక్రమాన్ని జరిపించాలి. మగ పిల్లలకు సరిమాసంలో, ఆడ పిల్లలకు బేసి మాసంలో తీయాలి. కేశఖండని జరిపించడానికి అనుకూలమైన వారాలు సోమ, బుధ,గురు,శుక్రవారాలు. ఈ వారాలలో మధ్యాహ్నం 12 లోపల కేశఖండన కార్యక్రమం పూర్తవ్వాలి. గురు, శుక్ర మౌడ్యాలలో చేయకూడదు. అలాగే శిశువు తల్లి గర్భవతిగా ఉండి 5 నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదు.