Site icon HashtagU Telugu

Right Colours for Your House: వాస్తు శాస్త్రం.. ఇంటికి ఈ రంగు పెయింట్ వేస్తే కలిసొస్తుంది!

Vasthu Tips

Vasthu Tips

సాధారణంగా ఇంటిని నిర్మించిన తర్వాత, లేదంటే ఇంటికి రంగులు వేపిస్తున్నప్పుడు చాలామంది ఇంటి రంగులు వేస్తున్న విషయంలో అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు వారికి ఇష్టమైన కలర్లను వేసుకుంటే, మరి కొంతమంది మాత్రం వాస్తు ప్రకారం గా ఆలోచించి రంగులు వేస్తూ ఉంటారు. అయితే మరి ఇంటికి వేసే రంగులు వాస్తు ప్రకారం గా వేసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇంటి రంగులు మనపై ఊహించని విధంగా మానసిక ప్రభావాన్ని కూడా చూపుతాయట. ఇల్లు అన్నది మనకు స్వర్గం లాంటిది కాబట్టి ఇంటికి వేసే రంగుల విషయంలో సమతుల్యత అనేది కీలకం.

ఇంటికి వేసే రంగులు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండడంతో పాటుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం కూడా రంగులు సహకరిస్తాయి. మరి ఇంటిలో ఏ దిక్కులకు ఎటువంటి రంగులు వేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈశాన్యంకు లేత నీలం, తూర్పు తెలుపు లేదా లేత నీలం, ఆగ్నేయంలో నారింజ లేదా గులాబీ మరియు వెండి రంగులను ఉపయోగించవచ్చు. అలాగే ఉత్తర దిశలో ఆకుపచ్చ, పిస్తా ఆకుపచ్చ వేయడం మంచిది. వాయువ్యదిశలో తెలుపు, లేదంటే లేత బూడిద మరియు క్రీమ్ ఉత్తమ రంగులు వేయడం మంచిది.

పడమర వైపు ఉత్తమ రంగులు లేదా నీలం లేదంటే తెలుపు రంగులు వేయాలి. నైరుతి వైపు పీచు, మట్టి రంగు, బిస్కెట్ లేదా లేత గోధుమ రంగు వేయడం మంచిది. దక్షిణ దిశలో ఎరుపు మరియు పసుపు రంగులు వేయడం మంచిది. ఇకపోతే నలుపు ఎరుపు మరియు గులాబీ వంటి రంగులను ఇంటికి వేసేటప్పుడు యజమానులు అదనపు జాగ్రత్తగా తీసుకోవాలని, ఎందుకంటే ఈ రంగులు చాలా మంది ఇష్టపడరని వాస్తు వ్యవస్థాపకులు తెలుపుతున్నారు.

Exit mobile version