Site icon HashtagU Telugu

Ashada Masam: ఆషాడ మాసంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఇదే?

Mixcollage 03 Jul 2024 05 36 Pm 1555

Mixcollage 03 Jul 2024 05 36 Pm 1555

ఆషాడ మాసం.. ఈ పేరు వినగానే ముందుగా స్త్రీలకు గోరింటాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. కచ్చితంగా ఒక్కసారైనా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఇంట్లో పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అయితే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది చాలామందికి తెలియదు కానీ పెద్ద వాళ్ళు చెప్పారని ఇప్పటికి చాలా మంది ఆషాడమాసంలో గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోమని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆషాడ మాసంలో భారీగా వర్షాలు పడుతూ ఉంటాయి.

ఇక కష్టార్జీతం చేసుకుని బతికే వాళ్ళు ఈ వానకు నానక తప్పదు పొలం పనులు చేసుకోక తప్పదు. ఇక ఇలా వానలో తడిచి నీళ్లలో కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి. ఆషాడం నాటికి వాతావరణం మొత్తం అంతా కూడా చల్లబడిపోతుంది. ఆ సమయంలో ఇలాంటి చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడం కోసం గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. గోరింటాకు కు ఒంట్లో ఉన్న వేడి తగ్గించ గుణం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది మన శరీరాన్ని చల్లబరిచే దోషాల బారిన పడకుండా చేస్తుంది. అదేవిధంగా ఆషాడమాసంలో కొత్తగా పెళ్లి అయిన నవవధువు పుట్టింటికి చేరుకోవడం ఎప్పటినుంచో ఆయవాయితిగా వస్తోంది.

అటువంటి సమయంలో పెట్టుకునే ఈ గోరింటాకు వారి సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుందట. అలాగే మెట్టింట్లో ఉన్న భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తుంది. ఇక సైన్స్ పరంగా తీసుకుంటే.. గోరింటాకు శరీరానికి తాగినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల అది ఎరుపు రంగులోకి మారుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరికే కోన్లలో కృత్రిమ రసాయనాలు కలుపుతున్నారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

Exit mobile version