ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రులు ముగిసిన తరువాత విజయదశమి పండుగను జరుపుకోనున్నారు. ఇక ఈ నవరాత్రులు జరిగే ఉత్సవాలకు కొందరు దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వినాయక చవితికి ఏ విధంగా అయితే విగ్రహాలను ఏర్పాటు చేస్తారో అదే విధంగా దుర్గామాత విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇదే నవరాత్రి ఉత్సవాలు చేయడం మంచిదే కానీ, ఈ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు దుర్గామాతకు కోపం తెప్పిస్తాయని చెబుతున్నారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
ఈ నవరాత్రులలో హెయిర్ కట్ చేయించుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే గుండు చేయించుకోవడం గడ్డం తీయించుకోవడం లాంటి పనులు కూడా అసలు చేయకూడదట. అలా చేస్తే దుర్గాదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. అలాగే కలశం ఇంట్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు దుర్గాదేవికి ఎదురుగా మాత్రమే కలశం ఉండాలి. అలాగే అమ్మవారి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. ఈ అఖండ జ్యోతి ని ఎవరు ముట్టుకోకుండా ఆరిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా జ్యోతి పెట్టిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఎవరో ఒకరు కచ్చితంగా ఉండాలి. ఇంటికి తాళం వేసి అసలు వెళ్ళకూడదు. ముఖ్యంగా దసరా నవరాత్రులలో మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. మద్యం మాంసంతో పాటుగా ఉల్లి వెల్లుల్లి అల్లం వంటి మసాల దినుసులను కూడా ఉపయోగించకపోవడమే మంచిదని చెబుతున్నారు.. నవరాత్రులు జరిగినన్ని రోజులు ఇంట్లో నిమ్మకాయను కోయరాదట.
అలా చేస్తే అరిష్టం కలుగుతుందట. కానీ మరి నిమ్మరసం లేకపోతే ఎలా అంటే అందుకు పరిష్కారం ఉంది. మార్కెట్‌లో దొరికే నిమ్మరసం బాటిల్స్‌ను వాడవచ్చని చెబుతున్నారు. తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం కూడా అసలు నిద్ర పోకూడదట. ఇలా చేస్తే ఉపవాస ఫలితం దక్కదని చెబుతున్నారు. అలాగే ఉపవాసం ఉండేవారు కొద్ది మొత్తంలో మాత్రమే పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. ఉపవాసం ఉండేవారు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని నీటిని బాగా తాగాలని చెబుతున్నారు. ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు తప్ప ఇతర ఏ కూరగాయలను తినరాదు. వాటిని కూడా ఉడకబెట్టుకుని అలాగే తినవచ్చు. కానీ కూరలా చేసి తినరాదు.
ఉపవాసం చేయని వారు పాలను కూరగాయలతో కలిపి వండి తింటే చాలా మేలు జరుగుతుంది. నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారి తిను బండారాలు నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారు రోటీ, పూరీ, పకోడీ తినాలి. నవరాత్రుల్లో సామ అన్నం సామలు అని పిలవబడే ఒక రకమైన తృణధాన్యం మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తినాలి. నట్స్ ఫాక్స్ నట్స్ అని పిలవబడే నట్స్‌ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తినవచ్చు. పైన చెప్పిన విషయాలు తప్పకుండా పాటించాలి. అప్పుడే ఆ దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.