Site icon HashtagU Telugu

Vajra Ganapati: 600 కోట్ల వజ్ర గణపతిని చూశారా..?

Vajra Ganapati

Compressjpeg.online 1280x720 Image 11zon

Vajra Ganapati: గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతి (Vajra Ganapati)కి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి, ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. 15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు. పరిమాణంలో ఇది కోహినూర్‌ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. ఈ వజ్రం ధరపై కనుభాయ్‌ వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Bhuvanagiri : బిఆర్ఎస్ కు భారీ దెబ్బ .. కాంగ్రెస్ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌

పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్‌ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకొచ్చారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉందని తన తండ్రికి కల వచ్చిందని, తెరిచి చూస్తే నిజంగానే వినాయకుడి ఆకారంలో ఉందన్నారు. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి తమ కుటుంబం పూజలు చేస్తున్నదంటున్నారు కనుభాయ్..! ‘‘అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు మా తండ్రికి కల వచ్చింది. ఒక వజ్రం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉంది. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి మా కుటుంబం పూజలు చేస్తోంది’’ అని కనుభాయ్‌ తెలిపారు.