October – Eclipses : ఈనెలలో రెండు గ్రహణాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం అక్టోబరు 14న సంభవించనుంది. అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య వేళ అక్టోబరు 14న(శనివారం) కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఆ రోజు రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:25 వరకు కొనసాగుతుంది. మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు. ఇది ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, పెరూ, క్యూబా, జమైకా, హైతీ, బ్రెజిల్, బహామాస్, ఆంటిగ్వా, ఉరుగ్వే, ఉత్తర అమెరికా, బార్బడోస్ మొదలైన దేశాలలో కనిపిస్తుంది. ఈ సూర్య గ్రహణం మనకు కనిపించదు కాబట్టి శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అక్టోబరు 28న (శనివారం) ఏర్పడే చంద్ర గ్రహణం మన దేశంలో అంతటా కనిపిస్తుంది. ఇది అక్టోబర్ 28న రాత్రి 1.04 గంటలకు ప్రారంభమై 2.26 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సూతకాలం భిన్నంగా ఉంటాయి. సూర్యగ్రహణం సూతకాలం గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభం కాగానే పూజలు ఆగిపోతాయి. ఆలయాల తలుపులు మూసేస్తారు. ఎలాంటి పూజలు నిర్వహించరు. అక్టోబర్ నెల అనేక విధాలుగా ప్రత్యేకమైనది. ఒకవైపు ఈ నెలలో దసరా నవరాత్రి ఉపవాసాలు మరియు పండుగలు జరుగుతుండగా, మరోవైపు ఈ నెలలో రెండో, చివరి సూర్య, చంద్ర గ్రహణాలు కూడా ఏర్పడబోతున్నాయి. నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమై అక్టోబర్ 23న (October – Eclipses) ముగుస్తాయి.
Also read : Hotel Prices Hike: ప్రపంచంలోని ఈ 10 నగరాల్లో హోటల్ ధరలు ఎక్కువ.. భారత్ లో ఏ నగరాలు అంటే..?
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.