Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు ..

అన్యాయంగా హనుమాన్ టెంపుల్‌ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు

Published By: HashtagU Telugu Desk
Bansi Mandir

Bansi Mandir

హిందువులు ఎంతో భక్తితో కొలిచే హనుమాన్ దేవాలయాన్ని (Hanuman Temple) ..పబ్లిక్ టాయిలెట్‌ (Public Toilet)గా మార్చిన ఘటన పాకిస్థాన్ (Pakistan ) లో చోటుచేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎక్కువగా ముస్లిం లు ఉన్నప్పటికీ గతంలో ఇండియా – పాక్ కలిసి ఉన్న క్రమంలో హిందువులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆ టైం లో హిందూ దేవాలయాలను నిర్మించి..భక్తులంతా టెంపుల్స్ కు వెళ్లడం , పూజలు చేయడం వంటివి చేసేవారు. తమకు ఒక ప్రత్యేక దేశం కవాలన్ని ఉద్దేశంతోనే ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న చాలామంది హిందువులు ఇండియా కు వచ్చేసారు. దీంతో అక్కడ ఉన్న హిందూ దేవాలయాలను కూల్చడం చేసారు..కానీ కొన్ని దేవాలయాలు అలానే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో లాహోర్‌లో నగరంలో బన్సీ మందిర్ (Bansi Mandir) అని పిలిచే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. 20 శతాబ్దానికి చెందిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఒక సంపన్న కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెపుతుంటారు. ఇప్పుడు ఆ ఆలయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ ఆలయాన్ని అలా శిథిలం చేసినా బాగానే ఉండేది. కానీ అన్యాయంగా హనుమాన్ టెంపుల్‌ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు. పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీ ఎక్కువ ఉంటుంది. మనం ముస్లిం లను ఎంతో గౌరవిస్తూ…మన ఇంట్లో మనిషిగా చూస్తాం..కానీ పాక్ లో మాత్రం హిందువులను, హిందూ దేవాలయాలను చాలా తక్కువ చేస్తారు. దీనికి ఉదాహరణే బన్సీ మందిర్. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Rakul Preet Singh : సమ్మర్ వేడి మరింత పెంచుతున్న అమ్మడు.. పెళ్లైనా తగ్గేదేలే..!

  Last Updated: 24 Apr 2024, 06:13 PM IST