Vastu Tips: షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కలిగే అదృష్టం ఫలితాలు ఇవే?

Vastu Tips: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం షమీ చెట్టుకు చాలా మహత్యం ఉంది. ఈ చెట్టు అనేక రకాల వాస్తు దోషాల నుంచి రక్షిస్తుంది. అందుకే హిందువులు ఈ షమీ చెట్టును ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఈ షమీ చెట్టును శని దేవుడితో సంబంధం అని చెబుతూ

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 07:45 AM IST

Vastu Tips: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం షమీ చెట్టుకు చాలా మహత్యం ఉంది. ఈ చెట్టు అనేక రకాల వాస్తు దోషాల నుంచి రక్షిస్తుంది. అందుకే హిందువులు ఈ షమీ చెట్టును ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఈ షమీ చెట్టును శని దేవుడితో సంబంధం అని చెబుతూ ఉంటారు. అయితే ఈ షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల పలు రకాల వాస్తు దోషాల నుంచి పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనకు తెలుసుకుందాం..

షమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గి పరిష్కారాన్ని లభిస్తాయి. అదేవిధంగా డబ్బుతో ముడిపడి ఉన్న సమస్యలు తొలగిపోయి, ఏదైతే డబ్బు రావాల్సి ఉంటుందో ఆ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే ఇంట్లో సుఖశాంతులతో అందరూ సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఈ మొక్కతో వాస్తు దోషాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అలాగే వైవాహిక జీవితం పట్ల ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల పరిష్కారం అవుతాయి. శని ప్రభావం మనిషి జీవితంలో పడితే వారి జీవితం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

శని ప్రభావం పడిన వారి జీవితాలు నాశనం అయిపోవడంతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. అటువంటివారు శనివారం రోజు షమీ మొక్కను ఎంతో నాటి పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. షమీ మొక్కను శనివారం నాడు ఇంట్లో నాటడం వల్ల ఫలితాలు కలుగుతాయి. దసరా పండుగ రోజున కూడా ఈ మొక్కను ఇంట్లో నాటుకోవచ్చు. షమీ మొక్కను ఇంటి ముఖద్వారంలో అమర్చుకోవాలి. మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు మీ కుడిచేతివైపుండేలా అమర్చుకోవాలి. ఇంటి పైకప్పు పై నాటితే మాత్రం దక్షిణం మూలన ఉండేలా చూసుకోవాలి.