Lucky Zodiac Signs : ఒకేరోజు హోలీ, చంద్రగ్రహణం.. 4 రాశుల వారికి శుభాలు

Lucky Zodiac Signs : ఈ  ఏడాది మార్చి 25న మనం హోలీ పండుగను జరుపుకోబోతున్నాం.

Published By: HashtagU Telugu Desk
Lucky Zodiac Signs

Lucky Zodiac Signs

Lucky Zodiac Signs : ఈ  ఏడాది మార్చి 25న మనం హోలీ పండుగను జరుపుకోబోతున్నాం. అదే రోజున తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అయితే మన దేశంలో ఈ  చంద్రగ్రహణం కనిపించదు. అందువల్ల సూతక్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోరు.  కానీ చంద్రగ్రహణం ఎఫెక్టు మొత్తం 12 రాశులపైనా ఉంటుంది. హోలీ, చంద్రగ్రహణం ఒకే సారి రావడం వల్ల ఈ ఏడాది హోలీ పండుగ నాలుగు రాశుల వారికి శుభప్రదంగా పరిణమించనుంది. అంతేకాకుండా ఆ రోజున శనిగ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించి సంవత్సరం పొడవునా ఇదే స్థితిలో ఉంటాడు. హోలీ నాడు శని గ్రహం, చంద్రగ్రహణాల కారణంగా ఏయే రాశులవారి అదృష్టం(Lucky Zodiac Signs) ప్రకాశిస్తుందో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఈ దఫా చంద్రగ్రహణం మార్చి 25న ఉదయం 10:23 గంటల నుంచి మధ్యాహ్నం 3:02 గంటల వరకు ఉంటుంది. భారతదేశం, అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్ వంటి ఇతర దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చంద్ర గ్రహణం కర్కాటకం, కన్య సహా తొమ్మిది రాశులకు అదృష్టాన్ని తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ రాశుల వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా శాలరీ హైక్ పొందొచ్చు. జీవిత భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించవచ్చు.

తులా రాశి వారికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు మార్చి 25న పూర్తి అవుతాయి. డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. సుఖశాంతులు, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి  మార్చి 25న చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగుల మద్దతుతో వృత్తిలో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరిగేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి.

మకర రాశి

మకర రాశి వారికి అధిపతి శనిగ్రహం. అందుకే వీరిపై శని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారికి మార్చి 25న భారీ ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే విజయం సాధిస్తారు. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఉన్నత పదవులు దక్కుతాయి. కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి.

  Last Updated: 04 Mar 2024, 12:27 PM IST