Site icon HashtagU Telugu

Ayodhya’s Ram Mandir: 32 మెట్లు ఎక్కితేనే రామ్‌లాలా దర్శనభాగ్యం.. రామ మందిరం గురించి ముఖ్యమైన సమాచారం ఇదే..!

Gifts From Abroad

Ayodhya Ram Mandir Temple Opening Ceremony Date announced

Ayodhya’s Ram Mandir: శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ఉండటంతో అయోధ్య వార్తల్లో నిలుస్తోంది.  జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya’s Ram Mandir) రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామాలయం దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. అయితే ఈ ఆలయం లోపలి భాగం ఎలా ఉంది? రాంలాలా దర్శనం కోసం ఎన్ని మెట్లు ఎక్కాలి..? ఆలయ ప్రవేశం, నిష్క్రమణ ఏ వైపు నుండి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

32 మెట్లు ఎక్కి రామ్‌లాలాను చూడగలుగుతారు

రాంలాలా దర్శనం కోసం భక్తులు చాలా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. భక్తులు కేవలం 32 మెట్లు ఎక్కి రామాలయం ప్రధాన ధామ్‌కు చేరుకుంటారు. అక్కడ రాంలాలా కన్పిస్తారు.

వృద్ధుల కోసం లిఫ్ట్ ఉంది

అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు ఈ 32 మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడకుండా చూసేందుకు ఆలయానికి పడమటి వైపున లిఫ్ట్ ఏర్పాటు చేయబడింది. శారీరక వైకల్యం ఉన్నవారు ప్రధాన ఆలయానికి లిఫ్ట్ సాయం తీసుకోవచ్చు.

రామ మందిరం ప్రవేశం- నిష్క్రమణ

భక్తులు ఆలయానికి తూర్పు వైపు నుండి ఆలయంలోకి ప్రవేశించవచ్చు. రాంలాలా దర్శనం తరువాత నిష్క్రమణ మార్గం దక్షిణం వైపు ఉంటుంది. ఆలయం లోపల 44 వేర్వేరు ద్వారాలు కూడా ఉన్నాయి.

Also Read: GMR School of Aviation : విమానాల నిర్వహణపై ఇంజినీరింగ్‌ కోర్సు.. జీఎంఆర్ ఏవియేషన్‌ స్కూల్‌ ఏర్పాటు

రామ మందిరం గురించి ముఖ్యమైన సమాచారం

– ఆలయం మొత్తం 70 ఎకరాల స్థలంలో ఉంది.

– ప్రధాన ఆలయం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది.

– రాంలాలా ప్రధాన ఆలయం కాకుండా ఆలయ సముదాయంలో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య ఆలయాలు ఉన్నాయి.

– ఇది కాకుండా ఆలయ సముదాయంలో నిషాద్ రాజ్, శబరి మాత, దేవి అహల్య ఆలయాలు ఉంటాయి.

– ఆలయ సముదాయంలో 70 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమిలో 70 శాతం మొక్కలు ఉంటాయి. ఈ చెట్లలో 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అనేక పురాతన చెట్లు కూడా ఉంటాయి.

– మూడు అంతస్తుల రామమందిరం మొదటి అంతస్తు పనులు పూర్తయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం రెండు, మూడు అంతస్తుల పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయి.

– అయోధ్యలోని రాంలాలా ఆలయంలో ప్రసాదం ఇవ్వడానికి భక్తులను అనుమతించరు.

– రాంలాలా స్వామి దర్శనం అనంతరం భక్తులకు ట్రస్ట్ ద్వారా ప్రసాదం అందజేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

రామ మందిర ప్రారంభానికి మీరూ వెళ్తుంటే అయోధ్యలో దొరికే కొన్ని రుచికరమైన ఆహారాలను తప్పకుండా రుచి చూసి రండి. అందులో కోవా, రామ్‌జీ సమోసా, టెహ్రీ, మఖాన్ మలై, కచోరి, ఆలూ టిక్కీ చాట్.. తప్పకుండా రుచి చూడాల్సిందే.