Ashadha Masam : పూర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలాన్ని ‘ఆషాఢం’ అంటారు. ఇప్పుడు నడుస్తున్నది ఆషాఢ మాసమే. జులై 6న ప్రారంభమైన ఈ మాసం ఆగస్టు 4 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది.ఈ మాసం పర్వదినాలకు(Festivals) పెట్టింది పేరు. అయితే ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. ఇంటి నిర్మాణాలు మాత్రం చేపట్టొచ్చు.శుభకార్యాలు జరగవు కాబట్టి ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. వాస్తవానికి ఇది శుచిమాసం. ఇంట్లో కంచు, ఇత్తడి పాత్రలు ఉంటే ఈ మాసంలో వాటిని శుభ్రం చేసుకోవాలి. వెండి, బంగారు ఆభరణాలను కూడా ఈ మాసంలో మెరుగు పెట్టించుకోవడం మంచిది.వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే ఈ మాసాన్నిసంధిమాసం అని కూడా పిలుస్తారు. ఈ టైంలో చర్మసంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం ఉంది.
We’re now on WhatsApp. Click to Join
- ఆషాఢ మాసం(Ashadha Masam) తొలిరోజు నుంచే పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు చాతుర్మాస వ్రత దీక్ష చేయడం మొదలుపెడతారు. ఈ దీక్ష దాదాపు నాలుగు నెలలపాటు కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది.
- ఈ Ashadha masamలో వారాహి గుప్త నవరాత్రులు పవిత్రమైనవి.
- ఆషాఢ పౌర్ణమిని గురుపూర్ణిమ అని అంటారు. వ్యాస భగవానుడి జన్మదినం ఉండటంతో ఆ రోజును గురుపూజ నిర్వహిస్తారు.
- ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించిందని అంటారు. అందుకే ఆ రోజున శ్రీవైష్ణవులు గోదాదేవిని ఆండాళ్‌గా ఆరాధిస్తారు. జగన్మాత రచించిన పాశురాలను భక్తితో పారాయణ చేస్తారు.
- ఆషాఢశుద్ధ షష్టి రోజు స్కందవ్రతం నిర్వహిస్తారు. ఈసందర్భంగా సుబ్రహ్మణ్యుడిని పూజిస్తారు. ఈ పూజలను చేసే అవివాహితులకు పెళ్లి అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు.
- ఆషాఢశుద్ధ సప్తమిని భానుసప్తమిగా పిలుస్తారు. ఆ రోజున డే, నైట్ ఒకే వ్యవధిలో ఉంటాయని అంటారు.
- ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటారు. అందుకే దీనికి శయనైకాదశి అనే పేరు కూడా వచ్చింది.
- ఆషాఢ మాసంలోని భోగ సప్తమి సందర్భంగా పంట పొలాల్లో జాతరలు నిర్వహిస్తారు.
- ఆషాఢ మాసంలోని కామదా ఏకాదశి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
- ఏటా ఆషాఢ మాసంలోనే ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. ఈరోజే ఆ మహాఘట్టం జరగబోతోంది. దీన్ని చూసేందుకు అశేష భక్తజనం పూరీ నగరానికి చేరుకోనున్నారు.