TTD: ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి : ఆచార్య రాణి సదాశివమూర్తి

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 01:23 PM IST

TTD: టీటీడీ ఆలయాల్లో ప‌నిచేస్తున్న‌ అర్చకులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉద్యోగుల శిక్ష‌ణ సంస్థ‌(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబ‌ద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహ‌దం చేస్తాయన్నారు.

శ్వేత సంచాలకులు భూమ‌న్‌ మాట్లాడుతూ ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతుల ద్వారా అర్చకులు పాండిత్యాన్ని సంపాదించవచ్చ‌న్నారు. వైఖానస ఆగమంలోని నిగూఢ‌మైన విషయాలను తెలుసుకుని భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాల‌ని కోరారు. ఈ తరగతుల్లో ఆరోగ్య సూత్రాలపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. పాంచ‌రాత్ర‌, శైవాగ‌మ అర్చ‌కుల‌కు కూడా పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

కాగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించని షాపులను మూయించండని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాల్లో పరిశుధ్యం, కొన్ని దుఖాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు.