Wishes fulfilled: ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు 7 రోజుల్లోనే నెరవేరాలంటే ఈ పనులు చేయాల్సిందే?

సాధారణంగా మానవులకు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కోరికలు ఉంటాయి. మానవుల కోరికల నెరవేర్చుకోవడం కోసం

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 06:15 AM IST

సాధారణంగా మానవులకు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కోరికలు ఉంటాయి. మానవుల కోరికల నెరవేర్చుకోవడం కోసం సనాతన ధర్మంలో అనేక విషయాలను తెలిపారు. అయితే మాములుగా కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఎప్పటినుంచో నెరవేరని మీ కోరికలను తీర్చే కొన్ని పరిష్కారాలను చెప్పబడ్డాయి. సాధారణంగా ఏదైనా పనులు అనుకున్నప్పుడు అవి వీలైనంత తొందరగా నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకోడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు అనుకున్న పనులు ఏడు రోజుల్లో పూర్తవ్వాలంటే కొన్ని రకాల పరిహారాలను పాటించాలి.

వారంలోని 7 రోజులలో సోమవారం శివునికి అంకితం చేయబడింది. శివునికి సోమవారం కాకుండా మరొక రోజు చాలా ప్రియమైనది. ఆ రోజును శివుడిని ఆరాధించడానికి చాలా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శివుడిని ఆరాధించడానికి సోమవారం ఉత్తమమైన రోజు. అలాగే శివుడికి ప్రదోషం అంటే చాలా ఇష్టం. మత గ్రంధాల ప్రకారం ప్రదోషం వచ్చిన రోజున ఉపవాసం పాటించడం ,ఆచారం ప్రకారం సాయంత్రం శివుడిని పూజించడం వల్ల మనిషి ప్రతి సమస్య తొలగిపోయి కోరికలు నెరవేరుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రదోషం ప్రతి నెల శుక్ల పక్షం ,కృష్ణ పక్షం పదమూడవ రోజు వస్తుంది. మత గ్రంథాల ప్రకారం ప్రదోష వ్రతం పాటించే వ్యక్తి ఇంట్లో లేదా శివాలయంలో శివుడిని పూజించాలి.

శివుడిని ఆరాధించడం ద్వారా, భోలేనాథ్ భక్తులపై తన ప్రత్యేక కృపను కురిపిస్తాడు. వారి ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. తన కోరిక నెరవేరాలని కోరుకునే వ్యక్తి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రుద్రాక్ష పూసలతో ఒక మంత్రాన్ని జపించాలి. ప్రదోష రోజున శివుడిని పూజించడానికి ఉత్తమ సమయం సూర్యాస్తమయం తర్వాత పరిగణించబడుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీం: తన్నో రుద్ర: ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తి ఏకాగ్రతతో,భక్తితో చేస్తాడో వారి కోరికను కేవలం 7 రోజులలో శివుడు నెరవేరుస్తాడు.