Padmavathi: తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

  • Written By:
  • Updated On - June 20, 2024 / 12:03 AM IST

Padmavathi: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.

ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. శ్రీ పద్మావతి అమ్మవారికి అంతే ప్రధాన్యం ఉంటుంది. తిరుమల కొండను దర్శించుకున్న భక్తులు కచ్చితంగా తిరుచానూరును దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.