మాములుగా ఆలయాలలోకి స్త్రీ పురుషులు పిల్లలు పెద్దలు అందరూ వెళ్లడం అన్నది సహజం. కానీ కొన్ని ఆలయాల లోకి స్త్రీలకు అదే విధంగా మరికొన్ని ఆలయాలలోకి పురుషులకు ప్రవేశం లేదు. అందులో ఇప్పుడు మనం పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు ఏవో వాటిలోకి ఎందుకు ప్రవేశం లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్.. ఇక్కడే ఉండే బ్రహ్మ ఆలయంలోకి వివాహిత పురుషులు ప్రవేశించడం నిషిద్దమట. కార్తీక పూర్ణిమ సందర్భంగా బ్రహ్మ దేవుడిని పూజిస్తూ ఒక వార్షికోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మదేవుడిని గాయత్రి దేవిని వివాహం చేసుకుంటాడు. ఇది సరస్వతి దేవికి కోపాన్ని తెప్పించింది. దీంతో సరస్వతి దేవి వివాహిత పురుషులు ఈ ఆలయంలోకి అడుగు పెట్టి పూజలు చేస్తే వారి వైవాహిక జీవితానికి ఇబ్బంది కలుగుతుందని ఈ ఆలయాన్ని శపించిందట. దీంతో ఈ ఆలయ గర్భగుడిలోకి పురుషుల ప్రవేశించకుండా నిషేధం ఉంది. ఇప్పటికీ ఇదే ఆచారం అక్కడ కొనసాగుతూనే ఉంది.
పురుషులకు ప్రవేశం లేని మరొక ఆలయం తమిళనాడులోని కుమారి అమ్మన్ ఆలయం. తమిళనాడులోని కన్యా కుమారి ఆలయం పార్వతి దేవి అవతారమైన కన్యా కుమారికి అంకితం చేయబడిన ఆలయం. పురుషులు, ముఖ్యంగా వివాహిత పురుషులకు దేవత విగ్రహం ఉన్న గర్భ గుడి లోపలికి అనుమతిలేదట. కేవలం మహిళలు మాత్రమే అక్కడ దేవతను నేరుగా పూజిస్తారట. ఆలయ సంప్రదాయాలు, నియమాల ప్రకారం సన్యాసులు ఆలయ ద్వారం వద్ద నుంచి మాత్రమే సందర్శించవచ్చని వివాహిత పురుషులు దూరం నుండి ప్రార్థనలు చేయవచ్చని చెబుటున్నారు.
పురుషులకు ప్రవేశం లేని మరో ఆలయం సంతోషి మాత ఆలయం. ఈ ఆలయం జోధ్‌పూర్ నగరంలో పురుషులను లోపలికి అనుమతించరట. శుక్రవారం సంతోషి మాతకు అంకితం చేబయడిన రోజు. కాబట్టి ఈ రోజున మహిళలు శాంతి సుఖాలను కోరుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. శుక్రవారాల్లో ఆలయ శక్తి పెరుగుతుందని కుటుంబ సామరస్యం, ఆనందం కోసం అమ్మవారిని మహిళల దర్శించుకుని పూజలు చేస్తారట. ఈ సమయంలో, లోపలి గర్భ గుడిలోకి పురుషులను అనుమతించరట.
అదేవిధంగా పురుషులకు ఆ ప్రవేశం లేని ఆలయాలలో కామాఖ్య ఆలయం కూడా ఒకటి. ఇది అస్సాంలో ఉంది. భారత్ లోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. కామాఖ్య దేవాలయం అస్సాం లోని గౌహతిలో నీలాచల్ కొండపైన ఉంది. ఈ ఆలయంలో కామాఖ్య దేవికి ప్రతి సంవత్సరం అంబుబాచి మేళాను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం మూడు రోజులు మూసివేయబడుతుందట. ఆ కాలంలో పురుషులను ప్రవేశించడానికి అనుమతి లేదని చెబుతున్నారు.