Dreaming Temple: కలలో గుడి కనిపించిందా.. అయితే ఈ పని చేయాల్సిందే?

మాములుగా కలలు రావడం అన్నది సహజం. మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని పీడకలలు వస్తూ ఉంట

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 08:30 PM IST

మాములుగా కలలు రావడం అన్నది సహజం. మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది పీడకలలు వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం మనకు వచ్చే కలల్లో కొన్ని మాత్రమే నిజమవుతాయి. అంతేకాకుండా కలలలో కనిపించే విషయాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, కలలు మనకు గతం, భవిష్యత్తు గురించి సమాచారాన్ని ఇస్తాయట. అయితే కలలో కొన్ని రకాల కలలను చాలామంది అంత తొందరగా మరిచిపోలేరు. కాగా ఒకవేళ మీరు పడుకున్నప్పుడు మీకు కలలో గుడి లేదా గుడి గంటలు మోగడం కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీకు కలలో దేవాలయం కనిపిస్తే అది శుభసూచకంగా భావించాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పనులు త్వరగా పూర్తవుతాయని అర్థం. అలాగే మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీకు కలలో దేవాలయం కనిపిస్తే, మరుసటి రోజు ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి, దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే మీకు కలలో పురాణ దేవాలయం కనిపిస్తే చాలా మంచిదట. అలాంటి కలలు మీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా మీ ముందు కనిపిస్తారని అర్థం. ఆ స్నేహితుడి సమావేశంతో మీరు అదృష్టవంతులు అవుతారు. మీ అనేక పనులు అతని సహాయంతో పూర్తి చేయబడతాయి. అదేవిధంగా స్వప్నశాస్త్రం ప్రకారం.. మీరు దేవాలయంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది.

మీరు దేనిలో కూరుకుపోయి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని దయతో మీకు ఏదైనా మంచి జరుగుతుంది. గంట మోగించడం లేదా గంటను చూడడం లేదా కలలో గంట శబ్దం వినడం శుభ సంకేతంగా పరిగణించాలి. ఈ కల ఒకరి ప్రయత్నాలలో విజయానికి సూచికగా భావించాలి. త్వరలో మీకు శుభవార్త అందుతుందని అర్థం. మీరు ఏ పని కోసం ప్రయత్నిస్తారో, ఆ పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు. అలాగే మీకు కలలో ఆలయానికి వెళ్ళినట్లు లేదా ఆలయం మెట్లు ఎక్కినట్లు కల వస్తే అది మంచి సంకేతంగా భావించాలి. భవిష్యత్తులో మీకు ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయని అర్థం.