Site icon HashtagU Telugu

Sri Meenakshi Agasteswara Swamy : శివలింగం లో నీరు ఉన్న ఆలయం

Temple With Water In Shivlingam.. Sri Meenakshi Agasteswara Swamy Temple

Temple With Water In Shivlingam.. Sri Meenakshi Agasteswara Swamy Temple

Sri Meenakshi Agasteswara Swamy Temple : శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోను సింధూ నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. ఆ కారణంగానే దేశంలో శివాలయాలే ఎక్కువగా ఉన్నాయి. వేదాలలో శివున్ని రుద్రునిగా, శైవంలో పరమాత్మగా, ఆదిదేవునిగా భావిస్తారు. స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకటిగా పూజిస్తారు.

శివుడు ఆద్యంతాలు లేవు. ఆయన రూపాతీతుడు.. అందుకే శివును ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్ వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్ వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్

ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటనివాడు శివుడు. కేవలం శివనామస్మరణంతోనే సకల జనులని పరిరక్షించే అమ్మ గుణం కలిగిన వాడు. అనంత పరిశుద్ధుడైనందునే ఏ గుణములు ఆయనను కళంకితుడిని చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join.

శివుని లీలలు ప్రతిబింబించే దేవాలయాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం (Sri Meenakshi Agasteswara Swamy Temple). ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ కొలువైన శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండా వదిలేస్తే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి. కృష్ణా పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి ప్రక్కనే కృష్ణా – మూసి సంగమ ప్రదేశం ఉండటం విశేషం.

ఈ క్షేత్రానికి స్థల పురాణం పరిశీలిస్తే.. కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో శివుడు, నరసింహస్వామిని పెట్టుకొని పవిత్ర ప్రదేశంలో వారిని ప్రతిష్ఠించాలని నిర్ణయించారట. ఈ క్రమంలో వాడపల్లికి వచ్చేసరికి చేరుకునే సరికి అనుకోని పరిస్థితుల్లో ఆ కావడి కింద పెట్టాల్సి వచ్చిందట. మళ్లీ దాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమైన ఆగస్త్యుడు ఆకాశవాణి వాక్కు మేరకు శివుడు, నరసింహ స్వామిని అక్కడే ప్రతిష్టించాడట. తదనంతరకాలంలో బోయవాడు పక్షిని వేటాడుతూ అక్కడికి వచ్చాడట. ఆ పక్షిని వదిలిపెట్టమని పరమశివుడు కోరాడట.

అందుకు ఆ బోయవాడు తనకు ఆకలిగా ఉందనడంతో పక్షి అంత మాంసం నా తలలోంచి తీసుకోమని శివుడు చెప్పాడంతో బోయవాడు తన పదివేళ్లను శివుడి తలలో పెట్టి మాంసం తీసుకున్నాడట. అలా శివలింగం శిరస్సుపై గుంటలా ఏర్పడి అందులో నీళ్లు ఊరుతాయని పురాణ ప్రతీతి.

Also Read:  Kanaka Durgamma Charitra : కనక దుర్గమ్మ గుడిని ఎవరు నిర్మించారు? ఇంద్రకీలాద్రి కి ఆ పేరు ఎలా వచ్చింది?