Temple Rules: మాంసాహారం తిని గుడికి వెళ్లకూడదా.. వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా?

హిందువులు పూర్వం నుంచి ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. అయితే కొందరు వాటిని పాటిస్తున్నా

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 04:00 PM IST

హిందువులు పూర్వం నుంచి ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. అయితే కొందరు వాటిని పాటిస్తున్నారు కానీ వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి వాటిని ఎందుకు పాటించాలి అన్న కారణాలు మాత్రం తెలియదు. మా పెద్దలు పాటించారు పెద్దలు చెప్పారు అందుకే మేము కూడా పాటిస్తున్నాము అని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మాంసాహారం తినే గుడికి వెళ్ళకూడదు అన్న నియమం కూడా ఒకటి. మరి మాంసాహారం తిని గుడికి ఎందుకు వెళ్ళకూడదు? అలా వెళ్తే ఏం జరుగుతుంది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలయాలకు ప‌రిశుభ్రంగా, ప్ర‌శాంతంగా వెళ్లే సంప్రదాయం ఉంది. గుడికి వెళ్లేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి లేదా పుణ్యనదులలో స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. కొందరు ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా గుడికి వెళ్తే, మరికొందరు సాత్విక ఆహారం తీసుకున్న తర్వాతే గుడికి వెళతారు. అయితే మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లడం త‌ప్పు చేసిన‌ట్టు పరిగణిస్తారు. మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం, మనస్సు కొద్దిగా అలసిపోయినట్లుగా, మందగించినట్లు అనిపిస్తుంది. అలాంట‌ప్పుడు మీరు ఆల‌యానికి వెళితే అక్క‌డి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు, శరీరం అంగీకరించవు.

మాంసాహారంలో తామసిక‌ గుణాలు ఎక్కువగా ఉన్నందున, మీ మనస్సు మంచి ఆలోచనలు, ప్రకంపనలను అనుభవించడానికి అనుమతించదు. మాంసాహార భోజనంలో కొవ్వు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను, శారీరక అవసరాలను పెంచుతాయి. అయితే మీ అంతర్గత ప్ర‌శాంతత‌కు భంగం కలిగిస్తాయి. మతపరమైన ఆచారాల్లో అంతర్గత ప్ర‌శాంత‌త‌కు, ఏకాగ్రతకు గొప్ప ప్రాముఖ్యం ఇచ్చారు. శాఖాహార భోజనంలో కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర కూరలు, ప‌లు ర‌కాల‌ మసాలాలు వంటి మసాలా దినుసులకు దూరంగా ఉండాలి. ఈ విషయాలు ఏమీ తెలియక గుడికి వెళ్తే అరిష్టమని, దేవుడికి కోపం వస్తుందని సమస్యలు మొదలవుతాయని కష్టాలు మొదలవుతాయని అనుకుంటూ ఉంటారు.