Site icon HashtagU Telugu

Duryodhana Temple : దుర్యోధనుడికి గుడి.. కులమతాలకు అతీతంగా పూజలు

Duryodhana Temple

Duryodhana Temple

Duryodhana Temple : దుర్యోధనుడిని మనం విలన్‌లా చూస్తాం. మహాభారతంలో ఆయన పాత్ర అలానే ఉంటుంది మరి. దుర్యోధనుడిని దుష్టుడిలా అందులో ప్రజెంట్ చేస్తారు. రావణుడిని శ్రీలంకలో పూజిస్తున్నట్టే.. శ్రీలంక సమీపంలోనే ఉన్న భారతీయ రాష్ట్రం కేరళలో దుర్యోధనుడికి గుడి కట్టి పూజిస్తున్నారు. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

కేరళ రాష్ట్రంలోని మలనాడకు వెళితే మనం దుర్యోధనుడి గుడిని చూడొచ్చు.ఈ ఆలయానికి వెళ్లాలంటే ముందుగా కొల్లాం చేరుకుని అక్కడి నుంచి మలనాడకు వెళ్లాలి. దగ్గర్లో కారుణగపాపల్లి అనే రైల్వేస్టేషన్లో దిగినా మలనాడకు చేరుకోవచ్చు. త్రివేండ్రం విమానాశ్రయంలో దిగినా వెళ్లేందుకు వీలుగా కార్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి.

Also Read : Ministries Race : మంత్రిత్వ శాఖల కేటాయింపుపై సస్పెన్స్.. మోడీ నిర్ణయమే ఫైనల్

మలనాడలోని దుర్యోధనుడి గుడి(Duryodhana Temple) కేవలం ఓ మతానికే పరిమితమైనది కాదు. కులమతాలకు అతీతంగా ఈ గుడిని అందరూ సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో దుర్యోధనుడికి కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్యోధనుడితో పాటూ తన భార్య భానుమతి, తల్లి దండ్రులు, గురువు ద్రోణుడు, స్నేహితుడు కర్ణుడికి కూడా పూజలు చేస్తుంటారు. అన్ని ఆలయాలకు గర్భగుడిలో విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ గర్భగుడిలో విగ్రహం ఉండదు. దుర్యోధనుడు కూర్చున్నాడని చెప్పేందుకు సూచనగా ఓ వేదిక మాత్రమే ఆలయంలో ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ దుర్యోధనుడిని దేవుడిగా భావించరు. ఆయనను అప్పుపన్ అనే పేరుతో ప్రేమగా పిలుస్తారు. అప్పుపన్ అంటే మలయాళం భాషలో  తాత అని అర్థం. దుర్యోధనుడితో పాటు దుశ్సాసన, దుస్సల, శకునికి కూడా ఈ సమీపంలో ఉన్న పవిత్రేశ్వరం వద్ద ఆలయాలను నిర్మించారు. కొల్లం, తిరువనంతపురం, అలప్పుజ , పతనంతిట్ట జిల్లాల్లో  ఈ ఆలయాలు ఉన్నాయి.

Also Read : Kesineni Nani : కేశినేని నానికి కిస్మత్‌ కలిసి రాలే..!

మహాభారత జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. అజ్ఞాతవాసంలో ఉన్న టైంలో పాండవులను పట్టుకునేందుకు దుర్యోధనుడు, శకుని ఎత్తులు వేశారు. పాండవుల జాడను వెతికే క్రమంలో అలసిపోయిన దుర్యోధనుడు కేరళ రాష్ట్రం మలనాడకు చేరుకునేసరికి నీరసించాడు. ఓ చోట సేదతీరేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఓ మహిళ  దుర్యోధనుడికి  కొబ్బరి కల్లు ఇచ్చింది. దానితో దాహం తీర్చుకున్న దుర్యోధనుడు.. సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోనే భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని(మలనాడు) వారికి కానుకగా ఇచ్చేశాడు. ఆ విశ్వాసంతోనే మలనాడు ప్రజలు దుర్యోధనుడికి ఆలయం కట్టి పూజిస్తున్నారు.