Temple Circling: ఆలయంలో ప్రదక్షణ ఎందుకు చేస్తారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

సాధారణంగా దేవాలయాలకు ఆలయాలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవుడి దర్శనం చేసుకుంటూ

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:00 AM IST

సాధారణంగా దేవాలయాలకు ఆలయాలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటె ఆలయ సందర్శన మాత్రం చేతనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అలా భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటూ ఉంటారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు. అసలు ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి?ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆలయం చుట్టూ అనగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా గ్రహాచారాలు బాగాలేకపోయిన అవి సరి అవుతాయి. ఇకపోతే ప్రదక్షిణలు శ్రద్ధతో చేతులు జోడించి చేయడం వలన మేలు జరుగుతుంది. అయితే ప్రదక్షిణలు చేయమన్నారు కదా అని ఎన్ని అంటే అన్ని అస్సలు చేయకూడదు. నియమిత సంఖ్యలోనే ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. ప్ర అంటే పాప నాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చుట, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుంచి విమోచనమ, ణ అనగా జ్ఞానం ద్వారా ముక్తి మార్గంలో పయనించాలి ముక్తిని ప్రసాదించాలని అర్థం.

అయితే ప్రదక్షిణ ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడి వైపుకు చేయాలి. కుడి వైపు శుభప్రదతను తెలపడమే. గర్భాలయం కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణం చేయడం వలన అన్ని వేళలా సాయం, శక్తి, మార్గదర్శకం ఇచ్చి భగవంతుడు సన్మార్గంలో నడిపిస్తాడనే నమ్మకం. సాధారణంగా కూడా మనకు కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండకపోవడం మనకు తెలిసిందే. కాగా, అలా మనం కుడివైపున అత్యంత ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఐటమ్స్ పెట్టుకుని, ఎడమ వైపున లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాటిని క్యారీ చేస్తుంటాం. అది మన సంప్రదాయంగా వస్తోంది. ఆ క్రమంలోనే ప్రదక్షిణం కుడి వైపునకు చేయడం వల్ల మేలు జరుగుతుందట