సంధ్యా వేల సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని, ఆ సమయంలో ఏది పడితే అది మాట్లాడకూడదని ముఖ్యంగా అశుభం మాట్లాడకూడదని అంటూ ఉంటారు. ఇలా తదాస్తు దేవతలు తిరిగే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి నిజంగానే తధాస్తు దేవతలు ఉంటారా? వారు కోరిన కోరికలు నెరవేరుస్తారా? ఇంతకీ తధాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు ఇలా అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తధాస్తు దేవతలను అశ్వినీ దేవతలు అని కూడా పిలుస్తారు. వీరు సూర్య పుత్రులు, కవలలు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతీ రోజు బ్రహ్మ ముహూర్తంలో వీరిద్దరినీ మేలుకొలుపుతూ ఉంటుందట. ఆ తర్వాత నిద్రలేచిన ఆ కవలలు రతన్ తీసుకుని తమ సోదరీ ఉషను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణిస్తారట. అయితే వీరు ప్రయాణించే ఆ రథం పేరు హిరణ్య వర్తం. వీరు ప్రయాణించే రథం బంగారు రథం.
వారు ఆ బంగారు రథంలో ప్రయాణిస్తూ చేతిలో బెత్తం పట్టుకుని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేస్తారట. అక్కడ ఉన్న ఆధిపతులను బెత్తంతో సుతి మెత్తంగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారట. అయితే ఈ దేవతలు ఎప్పుడు కూడా ఒక చేయి అభయ ముద్రతో మరో చేయి ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారట. వీరినే దేవతల వైద్యులు అని అంటారు. అయితే ఈ దేవతలు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకం మొత్తం సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుందట. ఇక తధాస్తు దేవతలు సూర్య సమయానికి 24 నిమిషాల ముందు తిరుగుతూ ఉంటారట. అలాంటి సమయంలో “ఓం శ్రీ అశ్వనీయే నమః” అనే మంత్రాన్ని జపించి మనసులో కోరిక కోరుకోవడం వల్ల అనుకున్నవి జరిగి, మనం కోరిక కోరికలు జరిగేలా తధాస్తు దేవతలు నెరవేరుస్తారట.