Lakshmi Devi: మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయా.. అయితే లక్ష్మీదేవి తలుపు తట్టినట్టే?

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నియమాలను పాటిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 09:35 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమకపడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తే వాటి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోయిల కూత చాలా బాగుంటుంది.

ఈ కోయిల కూత వ‌ల‌న మ‌న‌కు ధ‌న‌లాభం క‌లుగుతుంద‌ని అర్ధం. అలాగే కోయిల కూసే దిశ‌ల ఆధారంగా శ‌భ్ధాల ఆధారంగా శుభా అశుభాలుగా నిర్ణ‌యిస్తారు. కోయిల కూత ఉద‌యం పూట అగ్నేయ దిశ‌గా వినిపిస్తే అశుభం జ‌రుగుతుంద‌ని, అదే సాయంత్రం స‌మ‌యంలో వినిపిస్తే అది శుభా సూచిక‌గా ప‌రిగ‌ణిస్తారు. ఇక మ‌ధ్యానం స‌మ‌యంలో వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బ‌య‌ట‌కి వెళ్తే మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. మామిడి చేట్టుమీద ఉండి కొయిల కూస్తే ల‌క్ష్మీదేవి ఆగ‌మ‌నానికి సంకేతంగా పరిగణించాలి. అదేవిదంగా చాలా మంది బ‌ల్లి మీద ప‌డితే అశుభంగా భావిస్తారు. అయితే బ‌ల్లి వ‌ల‌న కొన్ని శుభ సూచిక‌లు కూడా ఉంటాయి. అక‌స్మాతుగా బ‌ల్లి మీ కుడి భుజం మీద లేదా కుడి మీద ప‌డి అది త్వ‌ర త్వ‌ర‌గా పైకి ఎక్కాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే ఆ సంకేతం మీ పురోగతి మార్గం తెరవబోతోందని అర్ధం.

అలాగే మీరు ఎదో ఒక ర‌కంగా డ‌బ్బును పోంద‌బోతున్నార‌ని అర్ధం. మ‌న ఇంట్లో ఏ చీమ‌లు ఉంటే మంచిదంటే ఎక్కువ‌గా న‌ల్ల చీమ‌లే అని చెప్ప‌వ‌చు. న‌ల్ల చీమ‌లు శుభ‌సూచిక‌గా భావిస్తారు. న‌ల్ల చీమ‌లు నోటితో భియ్యంను ను మోసుకొని వెళ్తే అది శుభ‌సూచికంగా భావించాలి. అక్షింతలు ల‌క్ష్మీదేవికి అత్యంత ప్రితిక‌ర‌మైన‌వి. అందుకే ఇవి సంప‌ద‌తో ముడిప‌డి ఉన్న‌వి. అదే ఇంట్లో ఎర్ర‌చీమ‌లు ఉంటే ఆ సంకేతం అంతమంచిది కాద‌నే చెప్ప‌వ‌చు. ఇంట్లో ఎర్ర‌చీమ‌లు క‌నిపిస్తే మీపై అప్పుల బారం పెరుగుతుంద‌ని అర్థం. ఇంట్లో పాము కనిపిస్తే దానిని చంప్పేంత‌వ‌ర‌కు నిద్ర‌కూడా పోరు. కాని అలా క‌న‌బ‌డితే అది శుభ‌సూచికంగా బావించాలి. ఇంట్లో రెండు మూకల పాము క‌నిపిస్తే ఇది శుభ‌సూచికంగా ప‌రిగ‌ణిస్తారు. చూసిన‌వారి ఇంటికి వెళ్ల‌డం చాలా పవిత్రంగా భావించ‌వచ్చు. ఈ పాము విష‌పూరిత‌ము కాదు. కాబట్టి అలాంటి పాములు చంపకూడదు.. ఒకవేళ మీకు ఆ పామును చూస్తుంటే భయం వేస్తుంటే ఆ పామును తీసుకెళ్లి బయటికి పెట్టాలి. అలా ఇంట్లో పాము కనిపించడం లక్ష్మీదేవి రాకకు ఆగమనంగా భావించాలి.