Site icon HashtagU Telugu

Dreams: ఈ 5 రకాల కలలను పొరపాటున కూడా ఇతరులతో అస్సలు పంచుకోకండి?

Mixcollage 01 Dec 2023 05 21 Pm 6880

Mixcollage 01 Dec 2023 05 21 Pm 6880

నిద్రలో కలలు రావడం అన్నది ఈ సహజం. అందులో కొన్ని మంచి కలలు ఉంటే మరి కొన్ని చెడ్డ కలలు ఉంటాయి. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయి అని చెబుతూ ఉంటారు. అలాగే మనం నిద్రపోయే సమయంలో ఏ విషయం గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి కలలే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి ఏ విషయం అయినా కూడా మనసులో దాగదు. ఎలాంటి కల వచ్చింది కలలో ఏం జరిగింది అన్న విషయాలను కూడా ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. అలా పంచుకోవడం మంచిదే కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఐదు రకాల కలలను పంచుకోవడం అసలు మంచిది కాదు అంటున్నారు పండితులు. మరి ఎలాంటి కలలను ఇతరులతో ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామందికి వచ్చే కలలో ఇతరులు చనిపోయినట్టు లేదంటే వారే చనిపోయినట్టు కూడా కలలు వస్తూ ఉంటాయి. అందులో మనం చనిపోయినట్టు మనకే కలరావడం, చనిపోయిన తర్వాత కూడా మనచుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. ఈ కల రాగానే చాలామంది భయపడి కుటుంబ సభ్యులతో ఎరువు పొరుగు వారితో పంచుకుంటూ ఉంటారు. అయితే అందులో భయపడాల్సిన పని ఏమీ లేదని అది శుభసూచకమే అంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఇలాంటి కల మీ ఇంటికి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని ఇది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ ఆనందం అందుకోలేరని చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులకు సేవ చేసినట్టు కల వస్తే అలాంటి కలను కూడా ఇతరులతో అస్సలు పంచుకోకూడదు.

అలాంటి కలలు మీ పురోగతిని సూచిస్తాయి. కాబట్టి అలాంటి కళలు ఇతరులతో పంచుకుంటే ఎటువంటి ప్రయోజనం పొందలేరు. అదేవిధంగా కలలో వెండి కలశం కానీ వెంట వస్తువులు కానీ కనిపిస్తే అది శుభప్రదంగా భావించాలి. ఆ కల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. అలాంటి కలను ఇతరులతో పంచుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగదట. అలాగే మనకు కలలో ఎప్పుడైనా దేవుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు చాలామంది సంతోషపడుతూ ఆ విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. దేవుడు కలలో కనిపించడం అన్నది కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోంది అనడానికి సంకేతంగా భావించాలి. ఇలాంటి కలను కూడా ఎవరితో పంచుకోకూడదు. అలాగే పండ్ల తోటలు మనకు కలలో కనిపిస్తే అది శుభ సూచికంగా భావించాలి. గర్భిణీ స్త్రీలకు పండ్లతోలు కనిపిస్తే అబ్బాయి పుడతాడు. పూల తోట కనిపిస్తే అమ్మాయి పుడుతుందట. ఇలాంటి కలలు కూడా ఇతరులతో అసలు పంచుకోకూడదు.