మరి కొద్ది రోజుల్లోనే 2025 కొత్త సంవత్సరం మొదలుకానుంది. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి సమయం ఆసన్నం అవుతోంది. ఇక కొత్త ఏడాది వస్తోంది అంటే ఈ ఏడాది అయినా మంచి జరగాలని చేపట్టిన పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. అంతేకాదు మంచి చెడులను గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. దీంతో రాబోయే సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగా చూపుతారు. ఇది గ్రహాల జాతకం, స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏడాది పొడవునా ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయట.
ఇకపోతే 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అన్న విషయానికి వస్తే.. 2025 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం మార్చి 29, 2025న మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వరకు ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్య గ్రహణం. ఇక సంవత్సరంలో రెండవ సూర్య గ్రహణం 21 సెప్టెంబర్ 2025న జరుగుతుంది. అది కూడా పాక్షిక సూర్య గ్రహణమే. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాల సమయం ప్రారంభం అవుతుంది. ఇది గ్రహణ కాలం ముగిసిన తర్వాత ముగుస్తుంది.
గ్రహణం కనిపించే ప్రదేశాలలో మాత్రమే సూత కాలం చెల్లుతుంది. సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూత కాలం కూడా చెల్లదు. ఇకపోతే ఈ మొదటి సూర్యగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుందట. సూర్యగ్రహణం తర్వాత కర్మ ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మీనరాశి లోకి ప్రవేశిస్తాడట. దీని వల్ల మిథునం, తుల, ధనుస్సు, మీనం రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారట. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆగిపోయిన పనులు మళ్ళీ సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉందని, ఈ రాశుల వారికి ఆరోగ్యం పరంగా కూడా మంచిది. అంతే కాదు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు..