Surya Grahan 2025: సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ సంఘటనలు. ఇవి గ్రహాల చలనం.. సూర్యుడు, భూమి చక్రాల మధ్య ఏర్పడతాయి. అయితే ధార్మికంగా సూర్య గ్రహణం (Surya Grahan 2025) ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీనిని చాలా అశుభంగా పరిగణిస్తారు. సూర్య గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం నుండి నిద్రపోవడం వరకు కొన్ని పనులు నిషేధం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం రెండవ సూర్య గ్రహణం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. అలాగే దాని తేదీ, సమయం, సూతక కాలం? ఈ సమయంలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.
సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?
2025 సంవత్సరంలో రెండవ, చివరి సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. ఇది సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటల నుండి ప్రారంభమై.. సెప్టెంబర్ 22న ఉదయం 3:24 గంటలకు ముగుస్తుంది.
Also Read: Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
సూర్య గ్రహణ సమయంలో చేయకూడని పనులు
సూర్య గ్రహణ సమయంలో పూజలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకూడదు. ఈ సమయంలో ఆలయాల గుమ్మాలు మూసివేయబడతాయి. సూతక కాలం ప్రారంభమైనప్పుడు ఇంట్లోని ఆహార పదార్థాలలో తులసి ఆకులు వేయాలి. సూర్య గ్రహణ సమయంలో దేవతా విగ్రహాలను తాకకూడదు. ఈ సమయంలో నిద్రపోవడం లేదా ఆహారం తీసుకోవడం కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకూడదు. అలాగే కత్తెర, సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
భారతదేశంలో సూర్య గ్రహణం కనిపించదు!
ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల దీని సూతక కాలం కూడా భారతదేశంలో చెల్లదు. ఈ సూర్య గ్రహణం అమెరికా, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రంలో మాత్రమే కనిపిస్తుంది.
- సెప్టెంబర్ 21, 2025: పాక్షిక సూర్య గ్రహణం
- ఈ గ్రహణం దక్షిణ ఆస్ట్రేలియా, పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
- భారతదేశంలో ఈ గ్రహణం కూడా కనిపించదు.