Sur Das Jayanti : వైశాఖ మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు సంత్ సుర్ దాస్ జయంతిని జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ఏప్రిల్ 25న మంగళవారం సంత్ సుర్ దాస్ జయంతి (Sur Das Jayanti) ఉంది. ఇది ఒక విధంగా శ్రీకృష్ణుని వేడుక. శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ దశలను వర్ణిస్తూ సుర్ దాస్ ఎన్నో పద్యాలు మరియు పాటలు స్వరపరిచారు. ఇవి హిందూ భక్తి సంగీతంలో ఇప్పటికీ విడదీయరాని భాగంగా ఉన్నాయి.
సుర్ దాస్ పుట్టినప్పటి నుండి అంధుడు.. అయినప్పటికీ అతను అద్భుతమైన కీర్తనలు పాడాడు. సూరదాస్ జీ శ్రీకృష్ణునిపై వెయ్యికి పైగా సంకీర్తనలు,ద్విపదలు, పద్యాలు రాశారు. సుర్ దాస్ జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం…
శ్రీకృష్ణుడిని ఆ వరం కోరాడు..
శ్రీకృష్ణుని పరమ భక్తునిగా పరిగణించబడే సుర్ దాస్ జీ క్రీ.శ.1478లో రుంకటా గ్రామంలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సూరదాస్ జీ తండ్రి పేరు రామదాస్. అతని అంధత్వం గురించి చాలా కథలు ఉన్నాయి. అతను పుట్టినప్పటి నుండి అంధుడిగా ఉన్నాడని కొందరు నమ్ముతారు. అయితే కొందరు దీనిని ఖండించారు. ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ ఉండేవారు.
ఒకసారి శ్రీకృష్ణుడు సుర దాస్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సుర దాసు శ్రీకృష్ణుని అమిత భక్తుడు. శ్రీకృష్ణుడి జీవితం, కాలక్షేపాలపై ఎన్నో పాటలు రాశారు. పురాణాల ప్రకారం.. ఒకసారి సుర దాస్ శ్రీకృష్ణుని భక్తిలో మునిగిపోయి బావిలో పడిపోయాడు. దీని తరువాత, శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి అతనిని రక్షించాడు. అతని కంటి చూపును పునరుద్ధరించాడు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, శ్రీకృష్ణుడు సుర దాస్‌ను ఏదైనా అడగమని అడిగినప్పుడు, అతను కృష్ణుడిని మళ్లీ అంధుడిని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. కృష్ణుడు తప్ప మరేమీ చూడకూడదని సుర దాస్ వరం కోరాడు.
Also Read: TTD: టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. టికెట్లు బుక్ చేసేటప్పుడు జాగ్రత్త