Lord Rama: పరమ పవిత్రం.. అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 04:06 PM IST

Lord Rama: అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు ఏం చేయాలి అని చాలామంది భక్తులకు సందేహం వస్తోంది. అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షింతలు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే

ఆక్షింతలను ఏం చేయాలంటే ?

22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకోవాలి. గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని.. పూజలు ముగించుకోవాలి

1.వ్యక్తిగతంగా పూజ చేయడం
2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,
3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం
4. బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం)
5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం
6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు…)

22 జనవరి ఏం చేయాలంటే ?

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి. జనవరి 22 ప్రాణ ప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి. అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి.

షెడ్యూల్ ఇదే

ఈనెల‌ 15 నుంచి అయోధ్య రామాల‌యంలో యఙ్ఞ క్రతువులు ప్రారంభమ‌వుతున్నాయి. జనవరి 15న సంక్రాంతితో అశుభ కాలం ముగుస్తుంది. ఆ ఘ‌డియ‌ల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావ‌డం జ‌రుగుతంది. మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 16వ తేదీన క‌నుమ నాడు అయోధ్య బ‌ల‌రాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ప్రారంభిస్తారు. ఈ ప్రతిష్ఠాపనలో భాగంగానే బ్రాహ్మణులు దీక్షను స్వీకరిస్తారు. జ‌న‌వ‌రి 17 వ‌తేదీ ముక్క‌నుమ నాడు శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఆ రోజే అయోధ్య రామ‌మందిరంలో ప్ర‌తిష్టంచునున్న రాముని విగ్ర‌హాన్ని ప్ర‌పంచం చూడ‌నుంది. ఇక‌, ఈ నెల 18వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

జనవరి 19న అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్ని గుండాన్ని స్థాపించనున్నారు. జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన నీటితో గ‌ర్భ‌గుడిని పవిత్రం చేయ‌నున్నారు. ఈనెల‌ 21 వ తేదీన జలాధివాసం చేస్తారు. జ‌లాధివాసం అంటే యజ్ఞం చేసిన త‌ర్వాత ప్రత్యేక పూజల మధ్య అయోధ్య శ్రీ‌రాముని విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమం అయిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది.