ఆదివారం అనగానే అందరికీ సెలవు రోజు గుర్తుకు వస్తుంది. పిల్లలనుంచి ఆఫీస్ పని చేసేవారు ఇలా ప్రతి ఒక్కరికి ఆదివారం రోజు సెలవు ఉంటుంది. ఈ ఆదివారం రోజు వచ్చింది అంటే చాలు నాన్ వెజ్ పండగ వచ్చినట్టే అని చెప్పాలి. రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటారు. చికెన్ మటన్ చాపలు వంటివి చేసుకొని తింటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆదివారానికి హిందూ సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఆదివారం రోజు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుందట.
ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం సరిగా లేకపోయి ఉంటుందో వాళ్ళు ఆదివారం రోజు కొన్ని రకాల చెడు ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయానికి వస్తే.. పొరపాటున కూడా ఆదివారం రోజు ఉల్లి వెల్లుల్లి అసలు తినకూడదని చెబుతున్నారు. ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఆదివారం రోజు తినడం వల్ల అనారోగ్యానికి కారణం కావచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా ఆదివారం రోజున చిక్కుడు బీన్స్ వంటివి కూడా తీసుకోకూడదట. పాలకూర కూడా తినకూడదట. పాలకూరను ఆదివారం తినడం అశుభం అని చెబుతున్నారు. ఆదివారం చేపలను కూడా తినకూడదట. చాలా మంది ఆదివారం అంటే నాన్ వెజ్ తినే రోజుగా భావిస్తారు.
మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే చేపలు తినడం అశుభం అని చెబుతున్నారు. ఒక చేపలు మాత్రమే కాకుండా ఆదివారం రోజు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తినకూడదని చెబుతున్నారు. ఆదివారం రోజు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. సూర్య భగవానుడిని ఆదివారం రోజు ఆరాధించడం వల్ల జాతకంలో సూర్య దోషం అలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయట.