హిందూమతంలో వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతాయని నమ్ముతారు. అలాగే మనకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారైనా ఆదివారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చట.
మరి ఆదివారం రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. హిందూ మతంలో ఉపవాస సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇతర ఆహార పదార్థాలతో పాటుగా పాలు, బియ్యం,బెల్లం దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుందట. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించాలట. ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.
ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే అనుకున్న పనులు పూర్తిగా కావాలి అనుకున్న వారు.. ఆదివారం ఎర్ర చందనం తిలకం పెట్టుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. సూర్యుడికి ఇష్టమైన బియ్యం పరమాన్నం ను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన పెళ్లిన పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు.