Zodiac: ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి సూర్యుడు.. 4 రాశుల వాళ్లకు కష్టాలు

ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Zodiac Signs

Zodiac Signs

ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఆ రోజున ఉదయం 09:57 నిమిషాలకు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్మ దేవుడు శని ఈ రాశిలో ఇప్పటికే ఉన్నాడు. తదుపరి ఒక నెల వరకు, సూర్యుడు , శని కలయిక కుంభరాశిలో ఉంటుంది. ఈ పరిణామం నాలుగు రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.ఈ 4 రాశుల వారు వచ్చే నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు .

◆ కర్కాటకం

సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత, మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు సమస్య ఎక్కువ అవుతుంది. ఈ సమయం ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉండదు. వాదోపవాదాలు పెరగడం కనిపిస్తుంది. అనవసరమైన ఒత్తిడి మిమ్మల్ని చుట్టు ముడుతుంది.  సూర్యుడు కుంభరాశిలో ఉండే వరకు మీరు జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి.

◆ సింహ రాశి

ఈ సంచారం తర్వాత సింహ  రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వ్యాపారంలో వేగం మందగిస్తుంది. ఆశించిన ఫలితాన్ని పొందడంలో సమస్య కూడా రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గొచ్చు. భవిష్యత్తు ఆందోళనల వల్ల మీకు టెన్షన్ పెరుగుతుంది.  ఆఫీసులో సహోద్యోగులతో వాగ్వాదం లేదా మనస్పర్థలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.  సమయం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది.

◆ కుంభం

మీ రాశిలో రాబోయే ఒక నెల రోజుల పాటు సూర్య దేవుడు, శని దేవుడు ఇద్దరూ ఉంటారు. ఈ సమయంలో మీ స్వభావంలో కొంత చిరాకు ఉండవచ్చు. మీ మాటల పట్ల చాలా నిగ్రహంతో ఉండాలి. కార్యాలయంలో ఆకస్మిక మార్పుల కారణంగా మీరు కలత చెందుతారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారి మధ్య విభేదాలు రావచ్చు. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిని ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది.

◆ మీనం

కుంభరాశిలో సూర్యుని సంచారం మీన రాశి వారికి అనుకూలంగా ఉండదు. ఈ కాలంలో మీ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.  తలనొప్పి, కంటి లోపాలు, జలుబు, దగ్గుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు.  సూర్య సంచారము తరువాత అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరగవచ్చు.  అనవసరమైన మానసిక ఒత్తిడి మీ సమస్యలను పెంచుతుంది.

  Last Updated: 10 Feb 2023, 10:44 PM IST