Broken Idol: ఇంట్లో అకస్మాత్తుగా దేవుడి విగ్రహం పగిలి పోతే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా హిందువులు ఇంట్లో రకరకాల దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అజాగ్రత్త వల్ల లేదంటే చిన్న చిన్

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 06:40 PM IST

మామూలుగా హిందువులు ఇంట్లో రకరకాల దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అజాగ్రత్త వల్ల లేదంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల దేవుడి విగ్రహాలు కింద పడి పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా వస్తువు తగిలి పగిలిపోవడం లేదంటే చిన్న పిల్లలు పగలగొట్టడం, చేతిలో ఉన్న విగ్రహం జారి పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అలాంటి విగ్రహాలను ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోని విగ్రహం అకస్మాత్తుగా పగిలిపోతే, దాని ద్వారా ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది.

చాలా సార్లు విగ్రహం ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా విరిగిపోతుంది. ఇది ఎందుకు జరిగిందో అర్థం కాదు. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతుంటే ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి ప్రభావం పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. అప్పుడు విరిగిన విగ్రహాన్ని ఇంట్లో నుంచి బ‌య‌ట ప‌డ‌వేయాలి. అలాగే విగ్రహం అలా పగిలిపోవడం మంచిదేనా అన్న విషయానికి వస్తే.. దేవ‌తా విగ్రహాలు పగలడంపై అనేక విధానాల ప్ర‌కారం ప‌లు భిన్న‌మైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దేవ‌తా విగ్రహం విరిగిపోయిందంటే ఇంటికి ఏదైనా అనర్థం జరుగుతుందని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో దేవుడి విగ్రహం పగలితే ఆ ఇంటిలోని ప్ర‌తికూల శ‌క్తి బ‌య‌ట‌కు వెళ్లిపోతుందని చాలా మంది నమ్ముతారు.

విగ్రహం పగలడం మంచిదికాదని భావించనప్పటికీ, దాని వ‌ల్ల ఆ ఇంటిలో నివ‌సించే వారికి మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తారు. మనకు తెలిసి, తెలియ‌క‌ ఒక్కోసారి ఇంట్లోని దేవ‌తా విగ్రహం ఒక్కసారిగా పడి విరిగిపోతుంది. అటువంటి ప‌రిస్థితి మీకు ఎదురైతే, అది భవిష్యత్తులో మీకు ఏమి జరుగుతుందో సూచనగా భావించాలి. విరిగిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల ఏదైనా ప్రమాదం జరగకుండా ఉంటుందని, తద్వారా విపత్తును నివారించవచ్చని చెబుతారు. అయితే అలాంటి ప‌గిలిన‌ విగ్రహాలను ఇంట్లో నుంచి తొలగించాలలి. పగిలిపోయిన విగ్రహం కానీ దేవుడి ఫోటోలు కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. అనేక సార్లు మీరు ర‌హ‌దారి కూడళ్లలో విరిగిన విగ్రహాలను చూసి ఉంటారు, కానీ వాస్తవానికి ఇలా చేయకూడదు. ఇంట్లోని విగ్రహం పగిలితే గౌరవప్రదంగా నదిలో నిమజ్జనం చేయాలి. దేవుడి ఫొటో అద్దం మాత్రమే పగిలితే మళ్లీ దాన్ని బిగించి అదే స్థలంలో అమర్చాలి.