మామూలుగా హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. చిన్న ఇల్లు అయినా సరే పూజ చేసుకోవడం కోసం ఒక చిన్న ప్రదేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేవుడు గదిలో ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఇది దేవుడి గదిలో దేవుడి విగ్రహం, ఫొటోలు, పూజా సామగ్రి తప్ప మరేమీ కనిపించకూడదు. పూజగదిలో దేవతలందరినీ పూజిస్తారు. అయితే ఏళ్ల తరబడి పూజలు చేస్తున్న మనం దేవుడి గదిలో ఏ వస్తువులు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అనే ఆలోచన కూడా చేయడం లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని గదిలో కొన్ని విగ్రహాలను ఉంచకూడదట. అలాంటి విగ్రహాలు పెట్టడం వల్ల ఆ గదిలో ఎంత పూజ చేసినా పూజలు చేసిన వారికి ఫలితం దక్కడం కష్టమే అని చెబుతున్నారు. అదనంగా వాటికి తోడు కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి.
కాగా ప్రకారం పూజ గది ఇంట్లో ఈశాన్య మూలలో ఉండాలి. లేదా తూర్పు లేదా పడమర పెట్టవచ్చు. కానీ ఉత్తరం లేదా దక్షిణం వైపు పూజ గది ఉండకూడదు. అయితే ఇంటి వాస్తు ప్రకారం ఉత్తరం వైపు పూజ గది పెట్టుకోవడం కొందరికి మంచిదే అని వాస్తు చెబుతోంది. అలాగే పూజా గదిలోని విగ్రహాలు సరైన క్రమంలో ఉండాలి. అయితే గృహ సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం ఇంట్లోని పూజా గదిలో ఏయే దేవుని విగ్రహాలను ఉంచకూడదో తెలుసుకుందాం.. దృష్టి దేవుని విగ్రహాలను ఇంట్లోని పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదని చెబుతున్నారు. ఎందుకంటే పూజా గదిలో ఏదైనా దేవత విగ్రహాన్ని అసంతృప్తి లేదా కోపంతో ప్రతిష్టించడం మనస్సులో అశాంతిని సృష్టిస్తుందట. ఇది ఇంట్లో గొడవలకు దారితీస్తుందట.
పూజ గదిలో కాళి, భైరవ, రాహు,కేతు, ఉగ్ర దేవతల విగ్రహాలు, ఫోటోలు ఉంచకూడదని చెబుతున్నారు. శని దేవుడు అందరికి న్యాయాధిపతి అని అంటారు. ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం అవసరమని అంటున్నారు. అయితే ఇంట్లో శని విగ్రహాన్ని పూజించరు. ఇంట్లోని పూజా గదిలో ఉంచడం అశుభం. ఇంటి వాస్తు ప్రకారం ఫోటో లేదా విగ్రహంలో ఏ మూల శనిని ఉంచాలో నిపుణులను సంప్రదించడం మీకు చాలా మంచిది. శాస్త్రాల ప్రకారం ఇంట్లో నరసింహ విగ్రహాన్ని పూజించకూడదు. ఈ ఉగ్రరూప అవతారం ఇంట్లో కలహాలు, చికాకులు కలిగించే అవకాశం ఉందని వాస్తు చెబుతోంది. ఇంట్లో పూజా గదిలో శివుడి విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. కానీ నటరాజ మూర్తిని ప్రతిష్ఠించకూడదు. ఈ విగ్రహం శివుని మహిమను తెలియజేస్తుంది. ఇది ఇంట్లో కలహాలకు దారి తీస్తుంది. లక్ష్మీ దేవత సంపద, ధాన్యాల దేవత. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని పూజాగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా బొమ్మ ఉంచుతారు. కానీ కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచడం మనకు చాలా మంచిది. మీ ఇంటి పూజా గదిలో పొరపాటున కూడా నిలబడి ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి నిలువెత్తు విగ్రహం ఉంటే ఎవరైనా అనారోగ్యానికి గురవుతారని పెద్దలు నమ్ముతారు. పూజ గదిలో విరిగిన విగ్రహాన్ని, చినిగిపోయిన, పగిలిపోయిన ఫోటోలు ఉంచవద్దు. ఒకవేళ అలాటివి ఉంటే వెంటనే ఇంటి నుండి అలాంటి విగ్రహాలు, ఫోటోలను బయటకు పారేయడం మంచిది. విరిగిన విగ్రహాన్ని, ఫోటోను పూజించడం వల్ల కుటుంబం సభ్యులు టెన్షన్ కు గురై గొడవలకు దారి తీస్తుందని పెద్దలు చెబుతున్నారు.