సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మనకు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. ఇక కలలో పక్షులు జంతువులు మనుషులు గతంలో జరిగిన సంఘటనలు ఇలా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది పీడకలలు వచ్చినప్పుడు దిగులు చెందుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు ఎప్పుడూ భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అందులో కొన్ని శుభ సూచకాలైతే మరికొన్ని అశుభానికి ప్రతీకలు కావచ్చు. అయితే కలలో మనకు కొన్ని రకాల కలలో మన అదృష్టం మారబోతుంది అని చెప్పడానికి సంకేతంగా భావించాలట.
అంతే కాకుండా కలలో కొన్ని కనిపిస్తే మీ దశ తిరగడం ఖాయం అంటున్నారు పండితులు. మరి కలలో ఏవి కనిపిస్తే దశ తిరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కలలో ఒక చెట్టు లేదా మరేదైనా ఎత్తైన ప్రదేశాన్ని అధిరోహిస్తే, మీరు రాబోయే కాలంలో అంతా శుభమే జరుగుతుందని అర్థం. అంటే మీరు పని రంగంలో పురోగతి, ఎన్నో పెద్ద ప్రయోజనాలను పొందబోతున్నారని అర్ధం. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందని అర్ధం. అలాగే కలలో ఆలయాన్ని చూడటం ఎంతో శుభసూచకంగా భావించాలట. ఒకవేళ మీకు కల పడితే మీరు పడుతున్న కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అర్థం. అలాగే దేవుని అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుందట.
కలలో మీకు వర్షం పడుతున్నట్టు కల వస్తే అది మంచిదే అని చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న మీ ఆర్థిక సమస్యలు తొలగిపోబోతున్నాయని అర్థమట. ఇలాంటి కలలు మీకు పడితే మీరు ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఈ కల మీ ఆనందం, శ్రేయస్సును సూచిస్తుందట. అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు.