Vastu tips : సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేస్తే అరిష్టమా..?

మన పూర్వీకుల నుంచి మనవరకు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పింది అన్నీ కాకున్నా కొన్ని మాత్రం ఇప్పటీ పాటించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 06:00 AM IST

మన పూర్వీకుల నుంచి మనవరకు కొన్ని ఆచారాలు సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పింది అన్నీ కాకున్నా కొన్ని మాత్రం ఇప్పటీ పాటించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సూర్యస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణగ్రంథాల్లో తెలియజేశారు. అంతే కాదు మన పూర్వీకులు కూడా సూర్యస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లు అమ్మమ్మలు, తాతమ్మలు ఇలాంటివి ఎక్కువగా చెబుతుంటారు. సాయంత్రంవేళ ఎవరూ నిద్రపోకూడదు. ఇంటిని శుభ్రం చేయరాదని…ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి బయటికి వెళ్లిపోతుందని అంటుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి, సరస్వతి, దర్గాదేవి సాయంత్రం వేళలో అందరి ఇళ్లలోకి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.

– మనం చేసే ప్రతి పనికి సరైన సమయం అనేది ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం మంచి అలవాట్లను కలిగి ఉండాలి. ఆ తర్వాతే పనులు కూడా సరైన సమయంలో పూర్తవుతాయి. ఎక్కువమంది సాయంత్రం వేళ నిద్రపోతారు. జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో నిద్రపోవడం చెడుగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా ఆయుష్షు తగ్గడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదట.

– సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట. ఒకవేళ ఇంటిని శుభ్రం చేస్తే ధన నష్టం కూడా వాటిల్లుతుంది.

-ముఖ్యంగా మహిళలు కానీ…పురుషులుకానీ సాయంత్రం వేళ ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదట. అలా చేయడం ఆ ఇంటికే అశుభం అని భావిస్తారు.

 

-సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టును తాగకూడదు. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు.