Site icon HashtagU Telugu

Success: ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదా.. అయితే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Mixcollage 04 Jul 2024 09 24 Am 4307

Mixcollage 04 Jul 2024 09 24 Am 4307

ఇతరులకు సహాయం చేసే గుణం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.. ఎందుకంటే దానగుణం కలిగిన వ్యక్తి అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి జీవితం కూడా సంతోషకరంగానే ఉంటుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. గొప్ప గొప్పగా దానధర్మాలు చేయకపోయినా ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేసిన కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అని పెద్దలు చెబుతుంటారు. న్యాయపరమైన సంపాదనతో చేసి ఎలాంటి కార్యమైనా సరే అది మంచి ఫలితాలను ఇస్తుంది. మన చేతులతో మనం ఎంత దానం అయితే ఇస్తామో అంతకు రెట్టింపు ఫలితాలను మనం పొందుతాము.

అయితే మనం కొన్ని కొన్ని సార్లు ఎంత కష్టపడినప్పటికి సక్సెస్ రాగా ఫలితం లేక చాలామంది తెగ కష్టాలు పడుతూ ఉంటారు. ఇలా మీకు కూడా జరుగుతూ ఉంటే వెంటనే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదంటే ఆవనూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు యొక్క వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు చేస్తూ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అని స్మరిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేస్తే కష్టాల నుంచి విముక్తి పొందవచ్చట.

అలాగే వారంలో మీకు ఎన్నిసార్లు వీలు అయితే అన్నిసార్లు గోమాతకు గ్రాసం లాంటిది పెట్టి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శుభకార్యాలకు వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరే ముందు ఓం శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించాలి. వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకొని పని మీద బయటకు వెళితే మీరు వెళ్లిన పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఎటువంటి పని చేపట్టినా కూడా జరగడం లేదని బాధపడుతున్న వారు ప్రతి ఆదివారం రోజు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో ఆరోగ్యం సమర్పించే నమస్కారం చేసుకోవాలి. అయితే ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు.

కేవలం ఆదివారం రోజు అని మాత్రమే కాకుండా ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే నలుపు రంగు దారాన్ని కొనుగోలు చేసి ఏమీ వయసుకు సమానమైన ముడులను దానిపై కట్టి అనంతరం అరటి తులసి ఆకుల రసాన్ని మీరు వేసిన ప్రతి ఒక్క ముడి పై వేసి, ఆ తర్వాత పసుపు సింధూరాన్ని కలిపి ఆ దారానికి రాయాలి. ఆ తరువాత ఆధారాన్ని కుడి చేతి కింద గా ఉండేటట్లు ధరించాలి. ఆ ధారాన్ని 21 రోజుల పాటు ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న నిరాశ తొలగి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పక్షులకు మూగ జంతువులకు ఆహార పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

Exit mobile version