ప్రస్తుతం చాలామంది సంపాదన కెరియర్ అంటూ వయసు మీద పడినా కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే ఉంటున్నారు. 30 40 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే ఉంటున్నారు. తర్వాత పెళ్లిళ్లు కాలేదని, పిల్లని ఇవ్వడం లేదని ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తుంటారు. అయితే చాలామంది పెళ్లిళ్లు కాలేదని డిప్రెషన్ లోకి వెళ్లడం, దేవాలయాల చుట్టూ తిరగడం రకరకాల హోమాలు వ్రతాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ పెళ్లి సంబంధాలు కుదరలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే పెళ్లి కాలేదని బాధపడుతున్న అబ్బాయిలు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే తప్పకుండా పెళ్లి కుదురుతుందని చెబుతున్నారు పండితులు.
మరి పెళ్లి కావాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వివాహ సమస్యలు ఉన్న మగవారు 41 రోజులపాటు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయాలని చెబుతున్నారు పండితులు. ప్రతిరోజు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు స్వహస్తాలతో ఏదైనా నివేదన చేసి, స్వామివారి ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేసి గోత్ర నామాలతో అర్చన చేయించుకోవాలట. సంకల్పం చెప్పే సమయంలో వివాహ దోష పరిహారార్థం అని చెప్పి స్వామి వారిని దర్శించుకొని వస్తే తప్పుక సకల వివాహ దోషాలు పరిష్కరించబడతాయట. అలాగే స్వామి వారి అనుగ్రహం వల్ల తప్పక శుభం కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
అయితే స్వామివారికి నివేదన చేయడానికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అంటున్నారు పండితులు. ఎందుకంటే మీ శక్తి మేరకు ఏది ఉంటే అది అనగా పాలలో చక్కెర వేసి కలిపి నైవేద్యంగా సమర్పించినా కూడా దేవుడు సంతోషిస్తాడని చెబుతున్నారు. లేదంటే అరటి ముక్కలు, పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి వంటివి కలిపి నైవేద్యంగా సమర్పించవచ్చని చెబుతున్నారు. దీనిని పెళ్లి కాలేదని దిగులు చెందుతున్న వారు స్వహస్తాలతో తయారు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల స్వామి వారు బాగా తృప్తి చెంది మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారట. స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీవల్లి కళ్యాణం శ్రీ దేవసేన కళ్యాణం వంటివి చదవడం వల్ల ఇంకా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మరింత మంచిది. భక్తి, శద్ధ, విశ్వాసంతో మీరు ఏం చేసినా స్వామి వారు అనుగ్రహం మీపై తప్పక ఉంటుందట. ఫలితాల గురించి ఆలోచించకుండా అనుమానం, ఆందోళన వదిలి మీరు పూజ చేయాలని, పెళ్లి కాని యువకులు తమ చేతులతో వారే స్వయంగా ఈ పూజ చేయాలని పిల్లల కొరకు తల్లిదండ్రులు పూజ చేస్తే ఫలితం ఉండదని చెబుతున్నారు పండితులు. అయితే పిల్లలకు కుదరని పక్షంలో తల్లిదండ్రులు చేయవచ్చని చెబుతున్నారు.