Site icon HashtagU Telugu

‎Nick Names: చిన్న పిల్లలను ముద్దుపేర్లతో పిలుస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Nick Names

Nick Names

‎Nick Names: మామూలుగా చిన్నపిల్లలను ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లలు ఉండే ఇళ్ళు కూడా ఎప్పుడు సందడి సందడిగా ఉంటుంది. వారి బుడిబుడి అడుగులు ముద్దు ముద్దు మాటలు చాలా ముచ్చటేస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఇంట్లో చిన్న పిల్లలను పేర్లకు బదులుగా చిన్ను, కన్నా, చింటూ, లడ్డు అంటూ ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా ముద్దు పేరుతో పిలిచేవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎ప్రతి పేరుకు దాని సొంత శక్తి, ప్రాముఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు పూర్వీకుల పేర్లు, దేవతల పేర్లు లేదా అర్థవంతమైన పేర్లను మంచి ఉద్దేశ్యంతో పెడతారు. దైవిక శక్తి లేదా పెద్దల లక్షణాలు ఆ వ్యక్తిని వారి పూర్తి పేరుతో పిలిచినప్పుడు బదిలీ అవుతాయట. అదేవిధంగా పూర్తి పేరును వాడకపోతే, ఆ పేరులోని మంచి శక్తి, సానుకూలత ఆ వ్యక్తికి అందదట. పురోగతి ఆగిపోతుందని, చెడు శక్తులు చుట్టూ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక చాలా ఇళ్లలో పిల్లలను ముద్దుగా పేర్లతో పిలవడం ఆచారం. అయితే కేవలం ముద్దు కోసమే కాకుండా కొన్నిసార్లు పిల్లల ఎత్తు, రంగు, బరువు, మాట లేదా అలవాటు ఆధారంగా పెట్టే మారుపేర్లు వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట.

‎బ్లాకీ, బోండం వంటి పేర్లతో పిల్లలను పిలుస్తుంటారు. ఇలాంటి పేర్లు పిల్లల మనసులో న్యూనతా భావాన్ని పెంచుతాయని,చిన్న వయసులో వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని చెబుతున్నారు. స్కూల్లో స్నేహితులు ఆటపట్టించే అవకాశం కూడా ఉంటుందట. ఇది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లలను వారి పూర్తి పేర్లతో లేదా గౌరవంతో కాకుండా ఆప్యాయత పేర్లతో మాత్రమే పిలవాలట. పిల్లలను గౌరవంగా గుర్తించడం వల్ల వారు తమ గురించి మంచిగా ఆలోచించుకుంటారట. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ నిర్మాణానికి సహాయపడుతుందని చెబుతున్నారు. పిల్లలను అవమానించే లేదా సగం పేర్లతో పిలవడం వెంటనే ఆపేయడం మంచిదట. ఇది వారి మంచి భవిష్యత్తు కోసం మనం వేయగలిగే చాలా ముఖ్యమైన మొదటి అడుగు అని చెబుతున్నారు.

Exit mobile version