Site icon HashtagU Telugu

Steve Jobs Wife : స్టీవ్ జాబ్స్ భార్య పేరు ఇక కమల.. ఎందుకంటే ?

Steve Jobs Wifes Hindu Name Kamala Laurene Powell Maha Kumbh 2025

Steve Jobs Wife : యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి పేరు మారింది. ఇక నుంచి లారీన్ పావెల్ జాబ్స్‌ను మనం కమల అని పిలవాలి.  గత శుక్రవారం రోజే (జనవరి 10న) ఆమెకు కమలగా నామకరణం చేశానని  నిరంజనీ అఖాడాకు చెందిన స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌ ప్రకటించారు. గతంలోనూ ఓసారి మెడిటేషన్ చేసేందుకు కమల తన ఆశ్రమానికి వచ్చారని ఆయన తెలిపారు.  ఈసారి మహాకుంభ మేళా వేళ  ప్రత్యేక పూజలు చేయించేందుకు కమల (లారీన్ పావెల్ జాబ్స్‌) వచ్చారని చెప్పారు. జనవరి 29వ తేదీ వరకు తమ ఆశ్రమంలోనే ఉంటూ పూజల్లో పాల్గొంటారని స్వామి కైలాసానంద గిరి(Steve Jobs Wife) వెల్లడించారు. దీంతోపాటు ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాకు వచ్చే సాధువులను కమల కలుస్తారన్నారు. భారత సంప్రదాయాల గురించి ఆమెకు అంతగా తెలియదని, వాటిని తెలుసుకునేందుకు కమల ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు.

Also Read :Trump vs Vance : ట్రంప్‌కు షాకిచ్చిన తెలుగింటి అల్లుడు.. వైస్ ప్రెసిడెంట్ కాకముందే..

మహాకుంభ మేళా వేళ నిరంజనీ అఖాడా పెద్దఎత్తున శోభాయాత్ర (పేష్వాయీ)ను నిర్వహిస్తుంటుంది. ఈ యాత్ర సందర్భంగా అఖాడాలోని సాధువులు, సన్యాసులు భక్తి శ్రద్ధలతో వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఈ యాత్రలో కమల పాల్గొంటారా ? పాల్గొనరా ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. దీనిపై స్వామి కైలాసానంద గిరిని ప్రశ్నించగా.. దీనిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమన్నారు. నిరంజనీ అఖాడా చేయనున్న పేష్వాయీ కోసం కమల పేరును ప్రతిపాదిస్తామని, అయితే అందులో పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆమెనే అని  స్వామి కైలాసానంద వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గురువుగా ఉంటారని.. భారత్‌లో తనను కమల గురువుగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. హిందూ ధర్మంపై కమల(లారీన్ పావెల్ జాబ్స్‌)కు ఆసక్తి కలగడం చాలా మంచి పరిణామం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని సనాతన ధర్మం ఆకట్టుకుంటోందన్నారు.

Also Read :Maha Kumbh Revenue : మహాకుంభ మేళాతో కాసుల వర్షం.. సర్కారుకు రూ.2 లక్షల కోట్ల ఆదాయం