Hanuman Pooja: కష్టాలతో సతమతమవుతున్నారా.. అయితే ఆంజనేయస్వామిని ఈ విధంగా పూజించాల్సిందే?

చాలామంది ఎంత సంపాదించినా కూడా ఇంకా కష్టాలు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అని

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 06:00 AM IST

చాలామంది ఎంత సంపాదించినా కూడా ఇంకా కష్టాలు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆర్థికపరంగా బాగానే ఉన్నప్పటికీ ఏదో రకంగా వారిని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే కష్టాల నుంచి గట్టెక్కాలంటే, కష్టాల నుంచి బయట పడాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కష్టాలతో సతమతమవుతున్న వారు ఆంజనేయ స్వామికి 41 రోజులపాటు నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. అలాగే ఆంజనేయ ఆలయం సమీపంలో ఉన్న రావి చెట్టుకి ప్రతిరోజు 11 ప్రదర్శనలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు నిదానంగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

అయితే ఆడవాళ్లు ఇలా ఆంజనేయస్వామికి 41 రోజులు పూజ చేయాలి అనుకుంటే మధ్యలో విరామం వచ్చినప్పుడు ఆ కొద్ది రోజులను విడిచిపెట్టి మిగిలిన రోజులను పూర్తి చేస్తూ 41 రోజులు పూజ చేయాలి. అలాగే ప్రమిదను భూమిపై పెట్టకుండా రావి ఆకు వేసి దానిపై పిండితో తయారు చేసిన దీపాన్ని పెట్టి కుంకుమ పూలతో అలంకరించి ఆ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆ పిండితో చేసిన ప్రమిదలో కొంచెం బెల్లం వేసి దానిపై ఒత్తి వేసి నూనె పోసి పూజ చేయాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవనూనెతో దీపారాధన చేయడం వల్ల మంచిది. అలాగే అనుకున్న పనులలో ఆటంకలు తొలగిపోవడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ ఐదింటిని కలిపి పిండి చేసి ప్రమిద చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి.

అలాగే శని వల్ల వచ్చే దోషాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే నల్ల నువ్వుల పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే కోరిన కోరికలు నెరవేరాలి అనుకుంటే బియ్యపు పిండి గోధుమపిండి సమానంగా తీసుకొని ప్రమిదల చేసి దీపారాధన చేయాలి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు శని దేవునికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తుల జోలికి రాకపోవడం మాత్రమే కాకుండా అటువంటి వారికి శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.