Site icon HashtagU Telugu

Srisailam Temple : శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం..ప్రసాదంలో మాంసపు ముక్క

A Piece Of Meat In Prasadam

A Piece Of Meat In Prasadam

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానం (Srisailam Mallikarjuna Temple)లో మహా అపచారం చోటుచేసుకుంది. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి గుడి వెనుక భాగాన గల తీర్థ ప్రసాదాల వితరణ వద్ద పులిహోర ప్రసాదం (Pulihora Prasad
)లో మాంసపు ముక్క (Piece of Meat) ప్రత్యక్షం కావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్ నుంచి వచ్చిన వేణుగోపాల్ అనే భక్తుడు ఉదయం 11.53 నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనం ముగించుకొని అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రసాదంలో కనిపించిన మాంసపు ముక్కను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దైవ దర్శనం కోసం వచ్చి మాంసపు ముక్కను కలిపిన ప్రసాదాన్ని తినడం అపచారంగా భావించిన భక్తులు ఆలయ పరిపాలన భవనంలో ఆలయ ఏఈవో హరిదాసు మరియు ఆలయ సహాయ కమిషనర్ హెచ్ వెంకటేష్ కి లికిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో పాటు మాంసపు ముక్కను కూడా అందజేయడం జరిగిందని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యము మరియు సుచి శుభ్రత లేని ప్రసాద అందజేయడంఫై మండిపడుతున్నారు. క్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.

ఈ ఘటనఫై టీడీపీ పార్టీ సోషల్ మీడియా లో స్పందించింది. ‘జగన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేవాలయాలు అపవిత్రం అవుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క రావటంతో భక్తులు ఖంగుతిన్నారు. ఇది నిర్ల్యక్షం కూడా కాదు, ఒక పెద్ద కుట్ర. దేవాలయాల పై దాడులు దగ్గర నుంచి, ఇక్కడ వరకు, ఇదో మహా కుట్ర’ అని ట్వీట్ చేసింది.

Read Also : Ashu Reddy : డివైన్ టైం.. వేణు స్వామితో కలిసి అషు రెడ్డి ఏం చేస్తున్నారు..?