Srisailam: టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి

Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం […]

Published By: HashtagU Telugu Desk
Srisailam

Srisailam

Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

కర్నూలు నగరంలోని శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం,వాణిజ్య సముదాయానికి 8 కోట్ల 60 లక్షల రూపాయలకు నిర్మాణానికి ఆమోదించారు. వీటితోపాటు సుండిపెంటలో నిర్మిస్తున్న దేవస్థానం సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరా ఏర్పాటుకు అంచనా వ్యయం 15 కోట్లుతో ఆమోదం తెలిపారు. క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించమన్నారు.

  Last Updated: 23 Feb 2024, 07:17 PM IST