Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం.. ఏర్పాట్లు సిద్ధం

TTD doing Prayers and Yagam in Tirumala for Rains

TTD doing Prayers and Yagam in Tirumala for Rains

Tirumala: తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, మ‌ళ్లీ మ‌రుస‌టి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.

తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.