Sagittarius: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 ధనుస్సు రాశి ఫలితాలు

ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరముగా ఉంటాయి. సోదరులతో తగాదాలు ఏర్పడినను సమసిపోవును. దైవ సందర్శనం చేస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లకు తగిన గుర్తింపు లభిస్తుంది.

శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 ధనుస్సు రాశి (Sagittarius) ఫలితాలు: 

మూల 1,2,3,4 పాదములు; పూ. షాఢ 1,2,3,4 పాదములు; ఉ.షాఢ 1వ పాదములు ఈ ధనుస్సు రాశి (Sagittarius) కిందకి వస్తాయి.

ఆదాయం :- 8, వ్యయం :- 11,
రాజపూజ్యం :- 6, అవమానం :- 3.

ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభకరముగా ఉన్నది. అనుకున్న కార్యములు విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరముగా ఉంటాయి. సోదరులతో తగాదాలు ఏర్పడినను సమసిపోవును. దైవ సందర్శనం చేస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులు రెండు పంటల వలన మంచి లాభములు పొందుతారు. గృహమున వివాహాది శుభకార్యక్రమములు జరుగుతాయి. వృత్తి పనివారికి ధనాదాయం పెరుగుతుంది. కళాకారులు సినీ రంగము వారు ప్రభుత్వ సహకారము పొందలేరు.

కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. కోర్టు, స్థిరాస్తి వ్యవహారములు సానుకూలముగా పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు సంతృప్తి కరముగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కిరాణా వ్యాపారస్తులకు ఆదాయము అభివృద్ధి చెందుతుంది. చేతివృత్తుల వారికి అనుకూల పరిస్ధితులు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితములను సాధిస్తారు. ధనాదాయమునకు లోటుండదు. పురోహితులకు, వాస్తు పండితులకు శుభాశుభమిశ్రమముగా ఉన్నది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవును.

ధనుస్సు రాశికి అదృష్ట సంఖ్య 2023..

ఈ ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి మరియు ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3 మరియు 7. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2023 జాతకం ప్రకారం 2023 సంవత్సరం కుల యోగం 7 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా, ఈ సంవత్సరం 2023 ధనుస్సు రాశి వారికి మంచి ఆర్థిక పురోగతిని తెచ్చే సంవత్సరంగా నిరూపించబడుతుంది. ఈ సంవత్సరం, మీరు సవాళ్ల నుండి బయటపడటం ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాన్ని పొందుతారు మరియు ద్రవ్య లాభాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి జ్యోతిష్య పరిహారాలు..

  1. ప్రతి గురువారం శ్రీ రామ్ చాలీసా పఠించండి.
  2. ప్రతి గురువారం శ్రీ రామ్ చాలీసా పఠించండి.
  3. మీ రాశిచక్రాన్ని పాలించే గ్రహం బృహస్పతి యొక్క ఏదైనా మంత్రాన్ని నిరంతరం జపించండి.
  4. గోమాతకు పచ్చి మేత మరియు కొంత బెల్లం తినిపించండి.
  5. ఇది కాకుండా, ఉత్తమ నాణ్యత కలిగిన పుష్యరాగం రత్నాలను ధరించడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
  6. ఆరోగ్యం బాగోలేకపోతే శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి.

Also Read:  Scorpio: శ్రీ శోభకృతు నామ సంవత్సర 2023 – 24 వృశ్చిక రాశి ఫలితాలు